ఇదో వింత కథ: చీటికి మాటికి భార్య అలా చేస్తుండటంతో.. ప్రియుడిని పిలిపించి!

Subscribe to Oneindia Telugu

పెరంబూరు: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ ప్రియురాలు.. తిరిగి ప్రియుడి వద్దకే వెళ్లాలని నిర్ణయించుకుంది. బలవంతంగా తాను కాపురం చేయలేనని, తన ప్రియుడితోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమి లేక ప్రియుడిని పిలిపించారు. కానీ ఆమెను చదివించడానికైన ఖర్చును తిరిగివ్వాలని భర్త కండిషన్ పెట్టాడు. ఆ యువకుడు అందుకు ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై సమీప ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవి(24) అనే స్థానిక యువతి చదువుకునే రోజుల్లో ఓ యువకుడిని ప్రేమించింది. దేవి మరొకరిని ఇష్డపడుతోందన్న విషయం తెలుసుకుని.. ఆమె తల్లిదండ్రులు మరో వివాహం జరిపించారు. అప్పటికీ దేవి భర్తను వదిలి రెండుసార్లు ప్రియుడి వద్దకు వెళ్లింది. అలా వెళ్లిన ప్రతీసారి తల్లిదండ్రులు తిరిగి ఆమెను తీసుకొచ్చి భర్తతో కలిపారు.

strange story: boyfriend paid down payment for his girlfriend

ఇటీవల ప్రియుడి వద్దకు వెళ్లిన దేవిని అక్కడి పోలీసులు తిరిగి తీసుకొచ్చి విచారించారు. దీంతో భర్తతో కాపురం చేయలేనని ఆమె తేల్చి చెప్పింది. అయితే వివాహం తర్వాత ఆమెను ఎంఈ చదివించినందుకు గాను రూ.1లక్ష ఖర్చు అయిందని, ఆ డబ్బును తనకు ఇప్పించాలని కోరాడు.

పోలీసుల ఆధ్వర్యంలో దీనిపై రెండు రోజులుగా చర్చలు జరిగాయి. చివరకు ఆ రూ.1లక్ష ఇచ్చేందుకు ప్రియుడు ఒప్పుకున్నాడు. విడతలవారీగా డబ్బు చెల్లిస్తానన్నాడు. తొలివిడుతగా రూ.25చెల్లించాడు. దీంతో భార్యను ప్రియుడితో పంపించేందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. అలా ఆ ప్రియురాలు, ప్రియుడు తిరిగి ఒక్కటయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its a strange incidnet took place in Manapparai, Tamilnadu. Husband sent his wife with her lover by taking money from him

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి