BBC Documentary : ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్-సుప్రీంకోర్టు కీలక నిర్ణయం !
గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్రమోడీ పాత్రను నిర్ధారించేలా బీబీబీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీంకోర్టు వచ్చేవారం విచారణ చేపట్టబోతోంది.
2002 నాటికి గుజరాత్ అల్లర్లలో అప్పటి సీఎం, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు పలు యూనివర్శిటీల్లో దీన్ని ఇప్పటికే పలుమార్లు ప్రదర్శించాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా పట్టించుకోకుండా దీని ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని విచారణకు స్వీకరించడమే కాకుండా వచ్చే వారం విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో వచ్చేవారం బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం వివాదంలో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు గతంలో క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ల విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని కేంద్రం తమ అత్యవసర అధికారాలు ఉపయోగించి నిషేధించడాన్ని పలువురు ఇప్పటికే తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై తమ ప్రత్యేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అత్యవసరంగా లిస్ట్ చేయాలని కోరుతూ సీరియల్ లిటిగెంట్ అడ్వకేట్ ఎంఎల్ శర్మ, సీనియర్ న్యాయవాది సియు సింగ్ చేసిన విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకుంది.
శర్మతో పాటు, ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, సామాజిక కార్యకర్త, లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మరో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications