వ్యక్తిగత గోప్యతపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, ఆధార్ లింక్‌పై సందిగ్ధత
వ్యక్తిగత గోప్యతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని న్యాయస్థానం తేల్చింది.
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యతపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని న్యాయస్థానం తేల్చింది.

వ్యక్తిగత గోప్యతపై 9 మంది జడ్జిల బృందం ఈ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ల ఆధార్ అనుసంధనంపై సందిగ్ధత ఏర్పడింది.
కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్ కార్డును తప్పనిసరి చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్‌పై విచారించేందుకు ఏర్పాటుచేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరగాలని తేల్చింది.
దీంతో ఈ విషయంపై చర్చించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. కొద్ది రోజులపాటు వాదోపవాదాలు విన్న విస్త్రత రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని పేర్కొంటూ గురువారం తీర్పు వెల్లడించింది.












Click it and Unblock the Notifications