టీ20 వరల్డ్ కప్: సెమీ పైనల్స్‌కు చేరిన భారత్... దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్

భారత క్రికెట్ టీమ్

సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ షాక్ ఇచ్చింది. 13 పరుగుల తేడాతో విజయం సాధించి ఆ జట్టును టోర్నీకి దూరం చేసింది.

దక్షిణాఫ్రికా ఓటమితో భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. అలాగే, పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.

టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కున్న నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కొలిన్ ఆకర్‌మన్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ఓపెనస్ స్టీఫెన్ మైబర్గ్ 37, టామ్ కూపర్ 35, మాక్స్ ఓడౌడ్ 29 పరుగులు చేశారు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో రిలీ రోసో చేసిన 25 పరుగులే అత్యధిక స్కోరు.

https://twitter.com/ANI/status/1589096072768782336

క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన నెదర్లాండ్స్ బౌలర్లు దక్షిణాఫ్రికా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లారు. బ్రండన్ గ్లోవర్‌ 3 వికెట్లు పడగొట్టగా, బాస్ డీ లీడే, ఫ్రెడ్ క్లాసెన్ చెరి 2 వికెట్లు, పాల్ వాన్ మీకెరెన్ ఒక వికెట్ తీశారు.

దీంతో ఆదివారం పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగబోయే రెండో గ్రూప్ మ్యాచ్ సెమీస్‌కు కీలకంగా మారింది. ఈ రెండు జట్లలో విజయం సాధించిన జట్టు నేరుగా సెమీస్ చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+