టీ20 ప్రపంచకప్: సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. జింబాబ్వేపై టీమిండియా భారీ విజయం

జింబాబ్వేపై టీమిండియా గెలుపు.. సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశలో చివరి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.

జింబాబ్వేతో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 71 పరుగుల తేడాతో గెలుపొందింది.

భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రపంచకప్‌లో మరొక అర్థ సెంచరీ సాధించాడు. 25 బంతుల్లోనే నాలుగు సిక్స్‌లు, ఆరు ఫోర్ల సహాయంతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించాడు. మూడేసి సిక్స్‌లు, ఫోర్ల సహాయంతో 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ 26 పరుగులు, హార్దిక్ పాండ్యా 18 పరుగులు సాధించగా, రోహిత్ శర్మ 15 పరులుగు, రిషభ్ పంత్ 3 పరుగులు చేశారు.

జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

ఆ జట్టులో ర్యాన్ బర్ల్ 35 పరుగులు, సికందర్ రజా 34 పరుగులు, క్రెగ్ ఇర్విన్ 13 పరుగులు, సీన్ విలియమ్స్ 11 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, పాండ్యా, షమీ చెరొక రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలొక వికెట్ తీశారు.

సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

4వ సారి సెమీ ఫైనల్స్‌కు చేరిన టీమిండియా

సూపర్ 12 దశలో టీమిండియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, దక్షిణాఫ్రికాపై పరాజయం పాలైంది.

టీమిండియా టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరడం ఇది 4వ సారి.

గతంలో 2007, 2014, 2016ల్లో కూడా భారత జట్టు సెమీ ఫైనల్స్ వరకూ చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+