తమిళనాడులో 97.4 లక్షల ఓటర్లు తొలగింపు..?
తమిళనాడులో ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం విడుదల కానున్న ముసాయిదా ఓటరు జాబితాలో 5.44 కోట్ల మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. SIR కు ప్రాథమికంగా తీసుకున్న 2025 ఓటర్ల జాబితాలోని 6.41 కోట్ల మందితో పోలిస్తే, ఇది 15.2 శాతం తగ్గుదల అని స్పష్టం అవుతోంది. అంటే తమిళనాడులో 15.2 శాతం ఓట్లను తొలగిస్తున్నట్లు అర్థం అవుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లను తొలగించిన విషయం తెలిసిందే. దాంతో SIR ప్రక్రియ బిహార్ లో వివాదాస్పదంగా మారింది.
ఈ తొలగింపులో భాగంగా చెన్నైలో 35.6 శాతం ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. TNIE పరిశీలించిన ఒక నివేదిక ప్రకారం, సోమవారం అధికారుల పర్యవేక్షణ కోసం రూపొందించిన సమాచారం మేరకు, వివిధ కారణాల వల్ల 97.4 లక్షల పేర్లను అన్ కలెక్టబుల్ గా గుర్తించారు.
తొలగించనున్న 97.4 లక్షల పేర్లలో, 52.6 లక్షల మంది (54.2శాతం) స్థానచలనం చెందినవారు.. అలాగే 26.9 లక్షల మంది (27.7శాతం) మరణించినవారు.. 13.6 లక్షల మంది (13.9శాతం) ఆచూకీ తెలియనివారు.. 3.98 లక్షల పేర్లు (4.1శాతం) నకిలీవి కాగా.. 16,400 మంది (0.2శాతం) ఇతర కారణాలతో అన్ కలెక్టబుల్ గా పేర్కొన్నారు.
ముసాయిదా విడుదలకు సంబంధించిన పనులు ఇంకా జరుగుతున్నందున, తుది సంఖ్యలలో స్వల్ప మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. చెన్నై ఓటర్ల సంఖ్య ప్రస్తుత 40.05 లక్షల నుండి 25.8 లక్షలకు (అంటే 35.6శాతం) తగ్గొచ్చని అంచనా ఏర్పడుతోంది. తొలగించిన 14.26 లక్షలమంది ఓటర్ల పేర్లలో, 12.23 లక్షల మంది (85.8శాతం) స్థాన చలనం అయినవారుగా గుర్తించారు.
ఇక తమిళనాడులోని పది జిల్లాల్లో ఓటర్ల సంఖ్య 15 శాతం కంటే ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది. చెన్నైకు పొరుగున ఉన్న చెంగల్ పట్టులో 27.87 లక్షల మంది ఓటర్లకు గాను 7 లక్షల పేర్లు తొలగించడంతో.. 25.18 శాతం తగ్గింపుతో రెండో అతిపెద్ద తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. తిరుప్పూర్, కోయంబత్తూరులో వరుసగా 23.1శాతం, 20.2 శాతం తగ్గుదలను అంచనా వేశారు.

తిరుప్పూర్ లో 24.4 లక్షల మంది ఓటర్లలో 5.6 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించగా, కోయంబత్తూరులోని 32.2 లక్షల మందిలో 6.5 లక్షల ఓటర్లను తొలగించొచ్చు. కాంచీపురం, తిరువళ్లూరు, దిండిగల్, వెల్లూర్, ఈరోడ్, తిరునల్వేలి.. తదితర మరో ఆరు జిల్లాల్లో కూడా SIR ముసాయిదా జాబితా 15 శాతం కంటే ఎక్కువ తగ్గొచ్చు. తమిళనాడులోని 38 జిల్లాల్లో కేవలం 10 జిల్లాల్లో మాత్రమే తొలగించే పేర్లు 10 శాతం కంటే తక్కువే. ముసాయిదా జాబితాలో ఉన్న 5.44 కోట్ల మంది ఓటర్లలో 2.02 కోట్ల మంది గత SIR జాబితాలో (2002 లేదా 2005) వారి సొంత పేర్లతో మ్యాప్ చేసినట్లు నివేదిక సూచిస్తోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications