తమిళనాడులో టీడీపీ సభ్యత్వ నమోదు, టార్గెట్ 5 లక్షలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ తమిళనాడు, కేరళ, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో విస్తరించాలని భావిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన ఇక్కడ ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ తమిళనాడు పరిశీలకుడు, కావలి శాసన సభ్యుడు బీద మస్తాన్ రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమిళనాడు శాఖ ప్రారంభం, సభ్యత్వ నమోదును అదే రోజు అధికారికంగా ప్రకటిస్తారు.
తమిళనాడు రాష్ట్రంలో ఐదు లక్షల సభ్యత్వాలను ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి తెలుగుదేశం పార్టీకి యాభై అయిదు లక్షల వరకు సభ్యత్వం ఉన్న విషయం తెలిసిందే.

రేపు ఉ.10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ
మంగళవారం ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె, టూరిజం పాలసీపై మంత్రివర్గం చర్చించనుంది. విజయవాడ మెట్రో డీపీఆర్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన గవర్నర్
త్వరలో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నపుష్కర ఘాట్‌లను గవర్నర్ నరసింహన్ సోమవారం పరిశీలించారు. కోటిలింగాల రేవు ఘాట్‌ను పరిశీలించారు. గవర్నర్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications