గడ్డం గీసుకోండి మహాప్రభు.. మోడీకి టీ విక్రేత వినతి, రూ.100 పంపి...

అప్పుడప్పుడు చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. కొందరీ ప్రవర్తన చర్చకు దారితీస్తోంది. సెలబ్రిటీల గురించి కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తారు. అలా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కూడా నిలిచాడు. మోడీకి పెరిగిన గడ్డం గీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. అందుకోసం రూ.100 కూడా పంపించారరు. ఈ విషయం దావానంలా వ్యాపించింది.

గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి వంద రూపాయలు పంపించిన ఘటన దుమారం రేపింది. మహారాష్ట్రలోని బారామతికి చెందిన టీ అమ్ముకునే వ్యక్తి. మోరే. దాంతో ఓ లేఖను కూడా జత చేశాడు. కరోనా మహమ్మారి వల్ల గత 15 నెలలుగా దేశంలోని అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బారామతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదురుగా టీ స్టాల్ నడుపుతున్న అనిల్ మోరే ప్రధానికి తన అసంతృప్తి గళాన్ని ఈ విధంగా వినిపించాడు.

tea vendor sends rs 100 to pm modi..

ప్రధాని నరేంద్రమోదీ గడ్డం పెంచుతున్నారు. ఆయన ఇకపై ఏదైనా పెంచాలనుకుంటే, అది ఈ దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేది అయి ఉండాలి. దేశ జనాభాకు వీలైనంత వేగంగా టీకాలు వేయిండానికి, వైద్య సదుపాయాలను పెంచడానికి ఆయన ప్రయత్నాలు చేయాలి. చివరి రెండు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపైనే ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో మోరే పేర్కొన్నాడు.

దేశ ప్రధాని అంటే ఎంతో గౌరవం, అభిమానం అని తెలిపారు. దాచుకున్న డబ్బుల్లో నుంచి ఆయనకు రూ.100 పంపుతున్నానని పేర్కొన్నారు. దాంతో ఆయన గడ్డం గీయించుకోవాలి. ఆయన ఈ దేశ అత్యున్నత నాయకుడు. ఆయన్ని అవమానించడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదని స్పష్టంచేశారు. మహమ్మారి వల్ల రోజు రోజుకు ఈ దేశ పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయనకు తెలియజేయాలనుకుంటున్నా అని పేర్కొన్నారు. ఆయన దృష్టిని ఆకర్షించేందుకే ఈ మార్గం ఎంచుకున్నానని మోరే తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+