బాస్ సోదరుడితో ప్రేమ, మహిళా టెక్కీ ఆత్మహత్య
బెంగళూరు: 25 ఏళ్ల మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. తాను పేయింగ్ గెస్టుగా ఉంటున్న సౌత్ ఈస్ట్ బెంగళూరులోని హుళిమావు దగ్గర్లోని బ్రిందావన్ లే అవుట్‌లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల మేరకు.. చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర సమీపంలోని హెబ్బూరుకు చెందిన 25 ఏళ్ల యువతికి బెంగళూరులోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.
ఆమె కొద్ది నెలలుగా అందులో ట్రెయినీ సాఫ్టువేర్ ఇంజనీర్‌గా అందులో పని చేస్తోంది. పేయింగ్ గెస్టు హౌస్‌లోని ఇతరులు ఆమె తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతికి కంపెనీ యజమాని అంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు.. సదరు యువతి సాఫ్టువేర్ కంపెనీ యజమాని సోదరుడితో ప్రేమలో పడింది. దీనిని ఆమె బాస్ అంగీకరించలేదు. అంతేకాదు తన సోదరుడికి దూరంగా ఉండాలని హెచ్చరించారట.
కాగా, ఆత్మహత్య చేసుకున్న యువతి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని పోలీసులు చెప్పారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ పైన, ఆయన సోదరుడి పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications