పూణేలో కారులో లిఫ్ట్ ఇచ్చి టెక్కీని దోచుకున్నారు

పూణే: థానేకు వెళ్లడానికి వాకాడ్‌లో కారులో లిఫ్ట్ తీసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దోపిడీకి గురయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు అతన్ని కారులో తిప్పి, అతని వద్ద ఉన్న విలువైన వస్తువులను, డబ్బులను లాక్కుని ముల్షీలోని పౌద్‌గావ్‌లో వదిలేసి వెళ్లిపోయారు.

వాకాడ్ నుంచి ముంబైకి, ఇతర ప్రాంతాలకు వాహనాల్లో లిఫ్ట్ ఇచ్చి ప్రయాణికులను దోచుకుంటున్న ఓ ముఠాను హించేవాడి పోలీసులు పట్టుకున్న తర్వాత వారం రోజులకే ఈ సంఘటన జరిగింది. ఇంజీనీర్ ఆశిష్ సరోద్ పూణేలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. థానేకు చెందిన అతను కొత్రూడ్‌లోని తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు.

థానేకు వెళ్లడానికి శుక్రవారం సాయంత్రం వాకాడ్ బైపాస్ వద్ద వాహనం కోసం ఎదురుచూస్తున్న సమయంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ ఎర్ర రంగు కారు అతని వద్ద ఆగిందని, రూ.200 ఇస్తే థానేలో దింపుతామని థానేలో దింపుతామని చెప్పారని, అప్పుడు కారులో డ్రైవర్ పక్కన ఇద్దరున్నారని పోలీసులు చెప్పారు.

Techie robbed in car after taking lift at Wakad

కొంత దూరం వెళ్లిన తర్వాత తాను ప్రమాదంలో ఉన్నట్లు సరోద్ గుర్తించి కారు ఆపాలని అడిగాడు. మాట్లాడవద్దని డ్రైవర్‌, ఇతర ఇద్దరు అతన్ని బెదిరించారు. నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పి, సరోద్ ల్యాప్‌టాప్, సెల్ ఫోన్, బంగారం గోలుసు, నగదు లాక్కున్నారు. వాటి విలువ దాదాపు 67 వేల రూపాయలు ఉంటుంది. మర్నాడు తెల్లవారు జామున అతన్ని పౌద్‌గావ్ వద్ద వదిలేశారు.

గస్తీ తిరుగుతున్న పోలీసులను సరోద్ ఆపాడు. వారు అతన్ని పౌద్‌గావ్ పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. అతను తన బావను సంప్రదించాడు. సరోద్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+