మాయం అయిన టెక్కీ: ఇద్దరు బిడ్డలను చంపేసి భార్య ఆత్మహత్య: అయినా రాలేదు!
చెన్నై: జీవితంపై విరక్తి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు భార్య ఇద్దరు బిడ్డలను హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై నగరంలోని సుబర్బన్ పళ్లికారాని ప్రాంతంలో జరిగింది. జిన్హా షా (35) అనే మహిళ కుమారుడు పరి (5), ఐదు నెలల కుమార్తెను హత్య చేసి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గుజరాత్ ఫ్యామిలీ
గుజరాత్ కు చెందిన శిరిక్ షా (39) భార్య జిన్హా షా, కుమారుడు పరి, కుమార్తెతో కలిసి చెన్నై చేరుకుని సబర్బన్ పళ్లిపాక్కాని ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. రాజీవ్ గాంధీ సలై ప్రాంతంలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో శిరిక్ షా సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.

సంక్రాంతి సెలవులు
సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ నెల గుజరాత్ వెళ్లిన శిరిక్ షా, జిన్హా షా దంపతులు వారం రోజులు అక్కడే కుటుంబ సభ్యులతో గడిపారు. వారం క్రితం మళ్లీ శిరిక్ షా దంపతులు చెన్నై చేరుకుని నుక్కంపాక్కంలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు.

ఉద్యోగానికి వెళ్లకుండా
గత సోమవారం ఉద్యోగానికి వెలుతున్నానని భార్య జిన్హా షాకు చెప్పిన శిరిక్ షా ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత ఇంటికి తిరిగిరాలేదు. భర్తకు ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యలేదు. ఉద్యోగం చేస్తున్న కంపెనీకి ఫోన్ చేస్తే గత బుధవారం నుంచి శిరిక్ షా ఉద్యోగానికి హాజరుకాలేదని అక్కడి సిబ్బంది జిన్హా షాకు సమాధానం చెప్పారు.

తల్లికి విషయం చెప్పింది !
గుజరాత్ లో నివాసం ఉంటున్న తల్లి నీతాకు విషయం చెప్పిన జిన్హా షా జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇద్దరు బిడ్డలను మంచం మీద నిద్రపెట్టి తలదిండుతో ముఖం మీద అదిమి హత్య చేసిన జిన్హా షా తరువాత ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అనుమానం
కుమార్తె జిన్హా షా ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చెయ్యకపోవడంతో గుజరాత్ లో ఉన్న ఆమె తల్లి నీతు బంధువులకు సమాచారం ఇచ్చింది. బంధువులు వెళ్లినా తలుపు తియ్యకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా అసలు విషయం వెలుగు చూసింది.

టెక్కీ అడ్రస్ లేడు
జిన్హా షా ఆత్మహత్య చేసుకోకముందు డెత్ నోట్ రాసి పెట్టారని, అందులో తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదు అని రాసిపెట్టారని పోలీసులు తెలిపారు. 10 రోజుల నుంచి మాయం అయిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు శిరిక్ షా కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications