టెక్కీలూ! డిమాండ్ పెంచుకోండి: ఈ కోర్సులతో జీతం 50 శాతం పెరుగుతుంది!
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి వెలుగురేఖలా కొన్ని స్కిల్స్ ఉపయోగపడనున్నాయి. డేటా విజులైజేషన్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ప్రస్తుతం
బెంగళూరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి వెలుగురేఖలా కొన్ని స్కిల్స్ ఉపయోగపడనున్నాయి. డేటా విజులైజేషన్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ప్రస్తుతం అత్యంత విలువైన టెక్నాలజీ రిక్రూటర్లుగా ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తుండటం గమనార్హం.
ఇటీవల కాలంలో డిజిటల్ డేటా ఎక్కువగా జనరేట్ అవుతున్న క్రమంలో ఈ స్కిల్స్ నేర్చుకున్న టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ స్పెషల్ కోర్సులను నేర్చుకుంటున్నారని తెలిసింది.

ఇటీవల కాలంలో డిజిటల్ డేటా ఎక్కువగా జనరేట్ అవుతున్న క్రమంలో ఈ స్కిల్స్ నేర్చుకున్న టెక్నాలజీ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందని తెలుస్తోంది. చాలామంది వర్కింగ్ ప్రొఫిషనల్స్ కూడా ఈ స్పెషల్ కోర్సులను నేర్చుకుంటున్నారని తెలిసింది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి 20శాతం నుంచి 50శాతం మధ్యలో వేతనాల పెంపు కూడా ఉంటుందని ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫాం సింప్లిలెర్న్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కౌసిక్ దలాలు వివరించారు.
అంతేగాక, గత మూడేళ్లుగా బిగ్ డేటా, అనాలిటిక్స్ కోర్సులకు మంచి వృద్ధి నమోదవుతుందని ఆయన తెలిపారు. డేటా సైన్సు కూడా ఎక్కడా తగ్గకుండా పాపులర్ చెందుతుందని తెలిపారు. గత 6నెలలుగా మిషన్ లెర్నింగ్, విజువలైజేషన్ టూల్స్ కోర్టులు కూడా అత్యంత ఆకర్షనీయంగా ఉన్నాయని చెప్పారు. 25శాతం సింప్లిలెర్న్ అప్లికెంట్లు మిషన్ లెర్నింగ్ ను ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు.
కాగా, ఈ కోర్సుల వ్యవధి 4 నుంచి 9 నెలలు ఉంటుందని, ఈ కోర్సులకు మొత్తం అయ్యే ఖర్చు సుమారు ఒక్కో మాడ్యూల్ బట్టి రూ. 25వేల నుంచి 60వేల వరకు ఉంటుందని సమాచారం. మరి టెక్కీలు ఈ దిశగా అడుగులు వేసి తమ జీతాన్ని భారీగా పెంచుకోవడంతోపాటు తమకున్న అవకాశాలను విస్తృతం చేసుకునే వీలు కలుగుతుంది. అమెరికాలో ఇప్పడు కఠినమైన ఆంక్షలు అమలవుతున్న క్రమంలో టెక్కీలు తమ నైపుణ్యాలను పెంచుకుని డిమాండ్‌కు తగినట్లు మలచుకోవడం అవసరమే.












Click it and Unblock the Notifications