తొలి ఐరన్ మ్యాన్ ఎంపీగా తేజస్వీ సూర్య రికార్డ్‌.. ప్ర‌ధాని మోడీ ఏమ‌న్నారంటే?!

గోవాలో నిర్వ‌హించిన‌ ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్‌లో బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య‌ విజేత‌గా నిలిచారు. త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని, ఐర‌న్ మ్యాన్ 70.3గా నిలిచిన తొలి ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా ఎంపీ 1.9 కి.మీ స్విమ్మింగ్‌, 90 కి.మీ మేర సైక్లింగ్‌తోపాటు 1.1 కి.మీ వ‌ర‌కూ రన్నింగ్ చేశారు.

ఆ పేరు అలా వ‌చ్చింది..

తేజస్వీ సూర్య గ‌తంలోనూ ఈ ఫీట్ సాధిందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేసిన‌ప్ప‌టికీ విజ‌యం సాధించ‌లేక‌పోయారు. 2022వ సంవత్సరంలో గోవాలో నిర్వ‌హించిన‌ పోటీల్లో ఆయ‌న పాల్గొన్నప్పటికీ కేవలం సైక్లింగ్ విభాగాన్ని మాత్ర‌మే పూర్తి చేయగలిగారు. అయితే, ఈసారి మాత్రం ధృడ సంక‌ల్పంత బ‌రిలోకి దిగిన తేజ‌స్వీ 50కిపైగా దేశాలకు చెందిన ఔత్సాహికులతో పాటు భారత్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 120 మందితో పోటీప‌డ్డారు.

Tejaswi Surya s record as the first Iron Man MP What does Prime Minister Modi say

అలాగే, ఈ పోటీల్లో 15 శాతం మంది మహిళలు కూడా ఉన్నారు. స్విమ్మింగ్‌, సైక్లింగ్, రన్నింగ్ ఈవెంట్స్ కలిసి ఉండ‌డంతో ఈ ఈవెంట్‌కు ట్రయాథ్లాన్ అనే పేరు పెట్టారు. ఈ మూడు ఈవెంట్ల మొత్తం టార్గెట్ 70.3 మైళ్లు (113 కి.మీ)గా ఉంటుంది. అందుకే దీనిని ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్ అని పిలుస్తారు.

అభినందిస్తూ ప్ర‌ధాని ట్విట్‌..

ఈ ఛాలెంజ్‌ను తేజ‌స్వీ 8 గంటల 27 నిమిషాల 32 సెకన్లలో పూర్తి చేశారు. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్ట‌కుని అన్ని విభాగాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఈ ఎంపీ దాదాపు నాలుగు నెలల పాటు క‌ఠోరంగా శ్రిమించారు. ఈవెంట్‌లో విజ‌యం త‌ర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తేజస్వీ సూర్య సాధించిన ఈ ఫీట్ ఎంతోమంది యువతను ఫిట్‌నెస్ యాక్టివిటీస్ దిశగా నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న‌ట్లు ఆయ‌న‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ప్ర‌ధానితోపాటు కేంద్రమంత్రులు అమిత్షా, పీయూశ్ గోయల్, మనసుఖ్ మాండవీయ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ తదితరులు తేజస్వి సూర్యను అభినందించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి తేజస్వీ సూర్య 2,77,083 ఓట్లతో మరోసారి ఎంపీగా విజయం సాధించిన విష‌యం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+