మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత: ఆరుగురు మృతి
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న డ్రోన్ బాంబు దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలతో స్థానికంగా మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో శనివారం ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మొదట ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపడంతో ఇరువర్గాల మధ్య కాల్పులకు తెరతీసింది.
ఈ క్రమంలోనే మరో ఐదుగురు సాయుధులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, చూరాచాంద్‌పూర్‌లో మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడ్నుంచే చేపట్టినట్లు సమాచారం.

రాకెట్ దాడుల ఘటనల్లో బిష్ణుపూర్ జిల్లాలో ఓ వృద్ధుడు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. మొదటి దాడి తెల్లవారుజామున 4.30 గంటలకు ట్రోంగ్లావ్‌బిలో జరిగింది. రెండు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రెండో దాడి మధ్యాహ్నం 3గంటలకు మొయిరంగ్‌లోని మాజీ సీఎం మైరెంబమ్ కొయిరెంగ్ నివాస ఆవరణలో రాకెట్ పడి అందులో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఆరుగురు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలోనే చూరాచాంద్పూర్‌లోని మువాల్ సంగ్, లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. మూడు బంకర్లను కూల్చివేశాయి. కుకీ మిలిటెంట్లు జరుపుతున్న దాడులతో మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా భద్రతా బలగాలు మోహరించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
పెరుగుతున్న హింసకు ప్రతిస్పందనగా, భద్రతా దళాలు బహుముఖ విధానాన్ని అమలు చేశాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థను మోహరించడం, ఆర్మీ హెలికాప్టర్లతో గస్తీ నిర్వహిస్తున్నారు. అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని గ్రామాలపై దాడిలో ఆయుధాలతో కూడిన డ్రోన్‌లను ఉపయోగించారని, భారత గడ్డపై ఇటువంటి దాడి జరగడం ఇదే మొదటిసారి పోలీసు అధికారులు తెలిపారు. కొండలు, లోయ ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, హింసను ప్రేరేపించే వారిని గుర్తించడానికి బృందాలు సోషల్ మీడియాను పర్యవేక్షిస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..












Click it and Unblock the Notifications