చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Tension: తంబి ఎన్నాఆయిచ్చి ?, అన్నా తడిచిపోయింది, ఓసి అంతేనా.... వెయిట్ అండ్ సీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఓ లెక్కింపు కార్యక్రమం జోరుగా సాగుతోంది. వార్ వన్ సైడ అయినా ఓ లెక్కింపు మాత్రం స్థానిక నాయకుల్లో బీపీ, షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయే విధంగా ఉంది. ఇక ఆ రాష్ట్ర ఆరోగ్యం శాఖా మంత్రి పోటీ చేసిన నియోజక వర్గంలో కేవలం ఒక్క రౌండ్ మాత్రం కౌంటింగ్ పూర్తి కావడం, ఈవీఎంల్లో తేడాలు రావడంతో ఇరు ప్రధాన పార్టీల నాయకులు, కౌంటింగ్ కేంద్రంల్లోని ఇరు పార్టీల ఏజెంట్లు ఢిష్యూం ఢిష్యూం అంటూ తలబడ్డారు. సందట్లో సడేమియా అంటూ చిన్నచితకా పార్టీలు సైతం గొడవ చెయ్యడంతో ఆ నియోజక వర్గంలో కౌంటింగ్ నిలిచిపోవడంతో అదరి శరీరాల మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. తంబి ఎన్నాఆయిచ్చి ?, అంటే కొందరు అన్నా తడిచిపోయింది అన్నారు. ఓసి అంతేనా.... వెయిట్ అండ్ సీ అని మరి కొందరు నాయకులు అంటున్నారు.

Khusbu: అందరూ గెలవాలి, కుష్బు లైట్లు ఆరిపోతాయా ?, అక్క వేదాంతం, తమ్ముళ్ల రాద్దాంతం, వైరల్ !Khusbu: అందరూ గెలవాలి, కుష్బు లైట్లు ఆరిపోతాయా ?, అక్క వేదాంతం, తమ్ముళ్ల రాద్దాంతం, వైరల్ !

 అక్కడ అన్నయ్య కెవ్వుకేక

అక్కడ అన్నయ్య కెవ్వుకేక

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార పార్టీ అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే పార్టీ నేతలు అన్ని ప్రయత్నాలు చేసేశారు. తమిళనాడులోని అనేక నియోజక వర్గాల్లో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ సీఎం అభ్యర్థి స్టాలిన్ తో పాటు పలు పార్టీల సీఎం అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడులోని విరళిమలై నియోజక వర్గం నుంచి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కె. విజయ్ భాస్కర్ పోటీ చేశారు.

 ఒక్క రౌండ్ తో తేడాలు

ఒక్క రౌండ్ తో తేడాలు

తమిళనాడులోని అన్ని నియోజక వర్గాలతో పాటు విరళిమలై అసెంబ్లీ నియోజక వర్గంలో ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఒక్క రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన వెంటనే అధికార అన్నాడీఎంకే పార్టీ నేతలు, డీఎంకే పార్టీ నేతలు ఇక్కడ ఏదో తేడా జరుగుతోంది, వెంటనే కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

 అన్నాడీఎంకే, డీఎంకే ఏజెంట్లు ఢిష్యూం.... ఢిష్యూం

అన్నాడీఎంకే, డీఎంకే ఏజెంట్లు ఢిష్యూం.... ఢిష్యూం

మొత్తం 6 రౌండ్ ల్లో విరళిమలై నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు జరగవలసి ఉంది. అయితే ఎన్నికల అధికారులు ఎలక్ట్రానిక్ యంత్రాల మీద కొడింగ్ వెయ్యడంలో పొరపాట్లు జరిగాయని, ఈ దెబ్బతో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Recommended Video

Washington DC : US House Passes Bill To Make Washington DC The 51st State | Oneindia Telugu
 మేము ఇక్కడే ఉన్నాము తంబి

మేము ఇక్కడే ఉన్నాము తంబి

ఇదే సమయంలో సందట్లో సడేమియా, మేము ఇక్కడే ఉన్నాము తంబి అంటూ పలు పార్టీల ఏజెంట్లు, నాయకులు ఓట్ల లెక్కింపుకు అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో ఆ నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు తాత్కాలికంగా నిలిపివేశారు. మొదటి రౌండ్ పూర్తి అయ్యే సమయానికి తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయ్ భాస్కర్ లీడింగ్ లో ఉన్నారు. మొత్తం మీద ఓట్ల లెక్కింపు నిలిచిపోవడంతో విరళిమలై నియోజక వర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొనింది.

English summary
vote counting stopped in Viralimalai constituency in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X