Terrorist: పాక్ ఉగ్రవాది అరెస్టు, ఏకే- 47, గ్రానేడ్ సీజ్, దసరా పండగకు స్కెచ్, భారత్ నకిలీ ఐడీతో !
న్యూఢిల్లీ: దసరా పండగ సందర్బంగా ఉగ్రదాడి చెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల దాడిని ఢిల్లీ పోలీసులు విఫలం చేశారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది భారతదేశం గుర్తింపు కార్డులు సంపాధించి దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేసి దసరా పండుగ సందర్బంగా ఉగ్రదాడులు చెయ్యడానికి ప్రయత్నించాడు. పక్కా సమాచారం అందండంతో పోలీసులు పాక్ ఉగ్రవాదిని అరెస్టు చేసి అతని నుంచి ఏకే 47 రైఫిల్ ( మిషన్ గన్) తో పాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకాలం మా మద్య ఓ ఉగ్రవాది ఉన్నాడని తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు.

దసరా పండగ సందర్బంగా ఉగ్రదాడికి స్కెచ్ !
దసరా పండగ సందర్బంగా దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులు ఇప్పటికే పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు దసరా పండగ సందర్బంగా దేశంలోని ప్రధాన నగరాలను, దేవాలయాలను లక్షంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది.

దేశ రాజధానిలో మకాం
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు తల దాచుకున్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు అధికారులకు సమాచారం అందింది. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్ లోని రమేష్ పార్క్ సమీపంలో ఓ ఇంటిలో తలదాచుకున్న పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. పాక్ ఉగ్రవాది ఇంటిలో సోదాలు చేశారు.

ఏకే 47, 60 రౌండ్లు, గ్రానేడ్ స్వాధీనంధీనం
పాకిస్తాన్ ఉగ్రవాది ఇంటిలో ఊఏకే 47 రైఫిల్ తో పాటు గ్రానేడ్, 60 రౌండ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని నుంచి మరింత సమాచారం సేకరించడానికి అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్ కు చెందిన మోహమ్మద్ అష్రాఫ్ ఢిల్లీలో తలదాచుకున్నాడని పోలీసు ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పాకిస్తాన్ ఉగ్రవాది మోహమ్మద్ అష్రఫ్ భారతదేశం గుర్తింపు కార్డులో లక్ష్మీనగర్ లో తలదాచుకున్నాడని పోలీసు కమీషనర్ రాకేష్ అస్థానా మీడియాకు చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాది ఎంతకాలం నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు? ఇతనికి భాతరదేశం జాతీయుడిగా గుర్తింపు కార్డు ఇప్పించింది ఎవరు ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

వీడు ఎలా వచ్చాడు , వెనుక ఎవరెవరు ఉన్నారు ?
పాకిస్తాన్ ఉగ్రవాది మోహమ్మద్ అష్రఫ్ భారతలోకి ఎలా వచ్చాడు ?, ఢిల్లీలో ఇతను ఉండటానికి ఎవరు అవకాశం ఇచ్చారు ?, ఇంకా ఇతని సహచరులు ఎవరైనా ఉన్నారా ?, వీరి ప్లాన్ ఏమిటి ? అంటూ ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. దసరా పండగ సందర్బంగా ఉగ్రదాడి చెయ్యడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల దాడిని ఢిల్లీ పోలీసులు విఫలం చేశారు. ఇంతకాలం మా మద్య ఓ ఉగ్రవాది ఉన్నాడని తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications