నర్సు మీద లైంగిక దాడి, అర్దరాత్రి నడిరోడ్డు మీద ?, నేవీ ఉద్యోగి చూసి !!
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నర్సింగ్ మహిళపై అత్యాచారం చేసి రోడ్డుపై ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆ యువతిని గమనించిన ఇండియన్ నేవీ అధికారి ఆమెను రక్షించారు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు తెలిపారు. యువతిపై అత్యాచారం చేసిన నిందితుల కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు.
గత సంవత్సరం ఒడిశాలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన యవతి ఢిల్లీకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం అత్యాచారానికి గురై ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గత సంవత్సరం ఒడిశాలో ఓ యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత అదృశ్యం అయ్యింది. యువతి అదృశ్యం అయ్యిందని ఒడిశాలో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలం తరువాత ఆ యువతిని ఢిల్లీ గుర్తించారు.
ఒడిశాలో మాయం అయిన యువతి ఢిల్లీలో నర్సుగా విధులు నిర్వహిస్తోందని పోలీసులు గుర్తించారు.

అంతరాత్రిలో ఆ యువతి ఒంటరిగా ఉండడంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఆ అధికారి వెంటనే ఆ యువతి వద్దకు వెళ్లాడు. యువతి దుస్తులు చిరిగిపోవడం, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని గుర్తించిన ఆ అధికారి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ యువతిపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన యువతి చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కనపడిన రోడ్డు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు ఆ యువతి కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు.
ఆ యువతి గత ఏడాది కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఢిల్లీలో నివసిస్తోందని, యువతి పరిచయస్తులే ఆమె మీద అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు అంటున్నారు. యువతికి పరిచయం ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications