బెంగళూరులో కుప్పకూలిన స్కూల్, పక్కన కార్లు, వాహనాలు ధ్వంసం, 80 మంది విద్యార్థులు?
బెంగళూరు: ఐటీ హబ్ లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల నిర్లక్షం చేయడంతో ఏకంగా 80 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ స్కూల్ లో తమ పిల్లలను చదివిస్తున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్కూల్ భవనం కుప్పకూలడంతో చుట్టుపక్కల ఉంటున్న వాళ్ల హడలిపోయారు.
బెంగళూరులోని శివాజీ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్ కుప్పకూలిపోయింది. అయితే అదే పాఠశాల విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బెంగళూరులోని శివాజీనగర్ లోని బీబీఎంపీకి చెందిన పాఠశాల భవనం కుప్పకూలింది. శివాజీనగర్‌లోని ఇదే బీబీఎంపీ ప్రభుత్వ స్కూల్ లో 80 మంది పిల్లలు చదువుతున్నారు.

బీబీఎంపీ ఇంగ్లీష్ మీడియం నర్సరీ స్కూల్ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానికులు హడలిపోయారు. 75 ఏళ్ల క్రితంనాటి ఈ పాఠశాలలో 80 మంది పిల్లలు చదువుతున్నారు. రోజూ 75 మంది పిల్లలు పాఠశాలకు హాజరు అవుతున్నారు. అయితే సోమవారం వేకువ జామున ఒక్కసారిగా ఈపాఠశాల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో పిల్లలు ఎవరూ పాఠశాలలో లేరు.
ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో పెను ప్రమాదం తప్పింది. గత శనివారం ఉదయం కూడా పిల్లలు ఈ పాఠశాలకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లారు. సోమవారం కూడా పిల్లలు బడికి రావాల్సి ఉంది. ఇంతలో పాఠశాల భవనం సోమవారం వేకువ జామున కుప్ప కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగినప్పుడు పాఠశాలలో సిబ్బంది ఎవరూ లేరని తెలిసింది.

ఒక్కసారిగా పాఠశాల కూలిపోవడంతో పక్కనే పార్క్ చేసిన వాహనాలు దెబ్బతిన్నాయి. కార్ల అద్దాలు పగులిపోయాయి. స్కూల్ పక్కనే పార్క్ చేసిన కొన్ని వాహనాలు పూర్తిగా భారీగా దెబ్బతిన్నాయి. దీంతోపాటు ఇరుగుపొరుగు ఇళ్లపైనా ప్రభావం పడింది. ఎవ్వరూ ఊహించని ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
జేసీబీ ద్వారా స్కూల్ భవనం శిథిలాలు తొలగించారు. పగలుపూట కాకుండా తెల్లవారు జామున స్కూల్ భవనం కూలిపోవడంతో 80 మంది చిన్నారులకు ఎలాంటి హానిజరగకుండా క్షేమంగా బయటపడడంతో వాళ్ల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల టీచర్లు, విద్యశాఖ అధికారులు, బీబీఎంపీ అధికారులు నిర్లక్ష్యం వహించడం వలనే ఈ ప్రమాదం జరిగింది. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications