సర్వే షాక్, సీఎం ఫుల్ హ్యాపీ, అలా ఎలా జరుగుతుంది ?, ఈ సర్వేలు నమ్మలేము అంటున్న ప్రతిపక్షాలు !
కర్ణాటక లోక్‌సభ పోరు తారాస్థాయికి చేరుకుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి రాష్ట్రంలో కనీసం 20 నియోజకవర్గాల్లోనైనా గెలుపొందాలని కష్టపడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అన్ని లోక్ సభ నియోజక వర్గాలు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ మొత్తం 28 నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని కలలు కంటోంది. ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా అనేక సర్వేలు వచ్చాయి. అయితే ఈసారి బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పడం లేదని ఓ సర్వే బయటకు వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సర్వేలో కచ్చితమైన లెక్కలు చెప్పిన లోక్ పోల్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఏయే పార్టీలు ఎన్ని సీట్లు గెలుచుకుంటాయనే సర్వేను విడుదల చేసింది.

లోక్ పోల్ సర్వే ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్ల నుంచి17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, బీజేపీ 11 సీట్ల నుంచి13 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ సర్వే బీజేపీకి షాక్ ఇచ్చింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 15 సీట్ల నుంచి17 సీట్లు గెలుచుకుంటుందని లోక్ పోల్ సర్వే చెప్పింది, ఇది బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద సులువుగా విజయం సాధిస్తామని కలలు కంటున్న బీజేపీ అభ్యర్థులకు ఈ లోక్ పోల్ సర్వే షాక్ ఇచ్చింది. ఈ లోక్ పోల్ సర్వే కాంగ్రెస్ కు పూర్తి సంతోషాన్ని కలిగించకపోయినప్పటికీ ఓ స్థాయిలో ఉపశమనం కలిగించింది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ 20కి పైగా సీట్లు గెలుచుకుంటుందని సీఎం సిద్ధరామయ్య గత కొంతకాలంగా ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఇది షాకే అనే ప్రజలు అంటున్నారు.
Here are our final figures for the state of #Karnataka
— Lok Poll (@LokPoll) April 13, 2024
▪️BJP 11 - 13
▪️INC 15 - 17
Sample size: 1,350 per Parliamentary constituency.
Just recalling our Karnataka assembly elections survey that was incredibly spot on. :)#LoksabhaElections2024 #Elections2024… pic.twitter.com/xofRxWpntj
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలకు గాను 26 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గంలో మాత్రమే గెలవడంతో ఆ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఇక మండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత అంబరీష్ విజయం సాధించారు. కర్ణాటక రాష్ట్రంలో రెండు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్ 26వ తేదీన, మే 7వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తం 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది ఇక 25 నియోజకవర్గాల్లో బీజేపీ, మూడు నియోజకవర్గాల్లో జేడీఎస్ పోటీ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications