Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

girlfriend: అడవిలో గర్ల్ ఫ్రెండ్ ను లోకేష్ ఏం చేశాడంటే ?, నగ్నంగా పరుగు తీసింది, మోజు తీరిందని ?

బెంగళూరు: ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అప్పటికే అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి నివాసం ఉంటున్న ప్రాంతంలోని యువకుడితో ఆమె పరిచయం పెంచుకుంది. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడు ఒకే ఊరిలో ఉండటంతో అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు. రానురాను సాయంత్రం కంపెనీలో నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరూ అలా బయటకు వెళ్లి తిరగడం మొదలుపెట్టారు. ప్రేమలో పడిన యువతి, యువకుడు రహస్య ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ప్రియుడి శారీరక కోరికలు మొత్తం తీర్చిన ప్రియురాలు తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ప్రియుడికి చెప్పింది. ఇదేమైనా సినిమానా ? అంటూ ప్రియుడు ఎదురు తిరిగాడు. అక్కడి నుంచి కథ ఊహించని మలుపు తిరిగింది.

బట్టలు లేకుండా పరుగు తీసిన యువతి

బట్టలు లేకుండా పరుగు తీసిన యువతి

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా కలకలం రేపే సంఘటన వెలుగు చూసింది. తిరుపూర్ జిల్లాలోని పల్లడం సమీపంలోని పెత్తంపాళ్యం రోడ్డులోని పనాయిపాలెం ప్రాంతంలో ఓ యువతి బట్టల్లేకుండా శరీరం మొత్తం కాలిపోయి సాయం కోసం కేకలు వేస్తూ అటవీ ప్రాంతం నుంచి బయటకు పరుగు తీస్తూ వచ్చింది. స్థానికులు యువతిని రక్షించి చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కంపెనీలో ఉద్యోగం

కంపెనీలో ఉద్యోగం

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి యువతి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించిందా లేక ఎవరైనా హత్య చేయాలని నిప్పంటించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో రాయలపాలెం ప్రాంతానికి చెందిన పూజా(19) అనే యువతి మంటల్లో కాలిపోయిందని వెలుగు చూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పూజా గురించి పోలీసులు వివరాలు సేకరించారు,

ఒకే కంపెనీలో లవర్స్

ఒకే కంపెనీలో లవర్స్

ఒకే ప్రాంతంలో నివసించే పూజా, లోకేష్‌ అనే అబ్బాయి ఓ ప్రైవేట్‌ బనియన్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారని పోలీసులు గుర్తించారు. గత ఏడాది నుంచి లోకేష్, పూజా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని పోలీసులకు తెలిసింది. సాయంత్రం కంపెనీలో నుంచి బయటకు వచ్చిన తరువాత లోకేష్, పూజా ఇద్దరూ బయటకు వెళ్లి తిరగడం మొదలుపెట్టారు. ప్రేమలో పడిన పూజా ఆమె ప్రియుడు లోకేష్ అటవి ప్రాంతంలోని రహస్య ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు.

పెళ్లి చేసుకోవాలని చెప్పిన ప్రియురాలు

పెళ్లి చేసుకోవాలని చెప్పిన ప్రియురాలు

ఎప్పటిలాగే లోకేష్ అతని ప్రియురాలు పూజాతో కలిసి అటవి ప్రాంతంలోకి వెళ్లి అతని కోరిక తీర్చుకున్నాడు. ఆ సందర్భంలో లోకేష్. పూజా ఇద్దరూ ఒంటరిగా అడవిలో కుర్చుని మాట్లాడుకున్నారు. లోకేష్‌ను పెళ్లి చేసుకోవాలని పూజా ఆ సందర్బంలో ఒత్తిడి చేసిందని సమాచారం. తన ్రియురాలు పూజా సినిమా టైపులో పెళ్లి చేసుకొవాలని చెబుతోందని, తాను ఏదో ఒకటి చెయ్యాలని లోకేష్ స్కెచ్ వేశాడు.

ప్రియురాలి మీద పెట్రోల్ పోసి అంటించేశాడు

ప్రియురాలి మీద పెట్రోల్ పోసి అంటించేశాడు

మరుసటి రోజు మళ్లీ పూజా, లోకేష్ అటవి ప్రాంతంలోకి వెళ్లారు. ఆ సందర్బంలో కోరిక తీర్చుకున్న లోకేష్ ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యాడు. తరువాత పూజా పెళ్లి విషయం ఎత్తింది. ఆ సయయంలో రగిలిపోయిన లోకేష్ అతని ప్రియురాలు పూజను బండరాయితో ఆమె తల మీద కొట్టాడు. తలకు బలమైన గాయమై అపస్మారక స్థితిలో పడివున్న పూజా మీద పెట్రోల్ పోసిన లోకేష్ ఆమెకు నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించి అక్కడి నుంచి పరారైనాడు.

ప్రియురాలి ప్రాణం పోయింది

ప్రియురాలి ప్రాణం పోయింది

మంటలు తట్టుకోలేక పూజా పరుగు తియ్యడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. విషయం మొత్తం తెలుసుకున్న పోలీసులు లోకేష్‌ కోసం గాలించారు. లోకేష్ కు కూడా మంటలు వ్యాపించడంతో అటవి ప్రాంతం సమీపంలో స్పృహ తప్పి పడిపోయిన లోకేష్‌ను కూడా అప్పటికే స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో పల్లడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సార్ కు మంటలు వ్యాపించి ?

సార్ కు మంటలు వ్యాపించి ?

లోకేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ానడని సమాచారం అందుకున్న పల్లడం డీఎస్పీ సెలమియా, పోలీసులు పల్లడం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శరీరంపై కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న పూజా చికిత్స విఫలమై గురువారం మృతి చెందిందని పోలీసులు అన్నారు.

అందుకే చంపేశాను.... ఎంతపని చేశావ్ లోకేష్ ?

అందుకే చంపేశాను.... ఎంతపని చేశావ్ లోకేష్ ?

దీంతో పోలీసులు లోకేష్ విచారణ చేసి వివరాలు సేకరించారు. తనతో ఎంజాయ్ చేసిన పూజా తరువాత పెళ్లి చేసుకోవాలని తన మీద ఒత్తిడి చెయ్యడంతో పక్కాప్లాన్ తో చంపేశానని లోకేష్ అంగీకరించాడని పల్లడం పోలీసు అధికారులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని చెప్పినందుకు ప్రియురాలిని ఆమె ప్రియుడు సజీవదహనం చెయ్యడం తిరుప్పూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+