woman: ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. చాలాసేపు ?, మహిళను ముక్కలుగా నరికేసి లోయలో ?
శ్రద్దా, నిక్కీ యాదవ్ వంటి యువతులను వారి బాయ్‌ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేయడం దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడు ఇలాంటి దారుణ హత్య చోటుచేసుకోవడంతో లోయలోని ప్రజలు హడలిపోయారు.
జమ్మూ కాశ్మీర్: భారతదేశంలో ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, మహిళలను కిరాతకంగా, అతి దారుణంగా హత్యలు చేస్తున్నారని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తో దారుణ హత్య మొదలైయ్యింది. శ్రద్దా, నిక్కీ యాదవ్ వంటి యువతులను వారి బాయ్‌ఫ్రెండ్స్ దారుణంగా హత్య చేయడం దేశాన్ని కుదిపేసింది. ప్రాణానికి ప్రాణానికి నమ్మి కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్లిన శ్రద్దా, నిక్కీలు కిరాతకంగా హత్యకు గురికావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి దారుణ హత్య ఘటనే చోటుచేసుకోవడంతో లోయలోని ప్రజలు హడలిపోయారు.

యువతి మాయం
జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లా షోబాక్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ మార్చి 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో మహిళ సోదరుడు తన్వీక్ అహ్మద్ ఖాన్ తన సోదరి కనిపించడం లేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన 30 ఏళ్ల సోదరి కోచింగ్ క్లాస్ వెళ్లిందని, తరువాత ఆమె ఇంటికి తిరిగి రాలేదని అహ్మద్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహిళను వెతకడం ప్రారంభించారు.

ఫోన్ కాల్స్ దెబ్బతో
కనపడకుండా పోయిన మహిళ మొబైల్ ఫోన్ నెంబర్ ను పోలీసులు పరిశీలించారు. మహిళకు పరిచయం ఉన్న షబీర్ అహ్మద్ వానీ (45) ఏళ్ల వ్యక్తి మీద డౌట్ రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కనపడకుండా పోయిన మహిళ చివరిసారిగా అతనితోనే మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా షబీర్‌ను పట్టుకుని అతన్ని పోలీసులు బెండ్ తీశారు. విచారణలో తాను మహిళను హత్య చేసి అనేక ముక్కలుగా నరికినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

పెళ్లి చెయ్యలేదని పగ
నిందితుడు షబీర్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు అన్నారు. యువతిlr వివాహం చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులను అడిగాడని, అందుకే వారు అంగీకరించలేదని పోలీసులు చెప్పారు. యువతిని పెళ్లి చేసుకుంటానని షబీర్ ఆమె బంధువులను కూడా అడిగాడని పోలీసులు అన్నారు. పెళ్లి చెయ్యడం కుదరదని చెప్పడంతో వారి మీద షబీర్ రగిలిపోయాడని పోలీసులు అన్నారు.

మహిళను ముక్కలు ముక్కలుగా నరికేశాడు
తర్వాత కార్పెంటర్ పని చెయ్యడానికి వెళ్లి వస్తున్న షబీర్ మహిళతో మాట్లాడాలని చెప్పాడని, మరుసటి రోజే ఆమెను పిలిపించుకుని ఆమెను అదే రోజు హత్య చేశాడని పోలీసులు అన్నారు. పోలీసులకు చిక్కిపోతామనే భయంతో షబీర్ ఆమె మృతదేహాన్ని పలు ముక్కలుగా నరికి ఓంపురా జిల్లాలోని పలు ప్రాంతంల్లో పడేశాడని పోలీసులు అన్నారు, షబీర్‌ను అరెస్టు చేసి అతని వాంగ్మూలం తీసుకున్నామని, మహిళ శరీర భాగాలను వెలికితీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications