సీఎం భార్య సంచలన నిర్ణయం, 40 ఏళ్లలో పెద్ద మచ్చ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 40 ఏళ్ల రాజకీయ జీవితానికి కేవలం 14 ఇంటి స్థలాలు పెద్ద మచ్చ తీసుకొచ్చింది. సీఎం సిద్ధరామయ్య పైన కేసులు కూడా నమోదు కావడంతో ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి పేరుతో ముడా 14 ఇంటి స్థలాలు ఇవ్వడం కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారి తీసింది.
తనకు ముడా ఇచ్చిన 14 ఇంటి స్థలాలను తాను తిరిగి ఇచ్చేస్తానని సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దొంగతనం చేసిన తర్వాత ఆ సొత్తు తిరిగి ఇచ్చేస్తే దొంగతనం దొంగతనం కాకుండా పోతుందా ? అంటూ సీఎం సిద్దరామయ్యపై కోర్టుకు ఫిర్యాదు చేసిన నటరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసి 14 ఇంటి స్థలాలు తీసుకున్న సీఎం సిద్దరామయ్య ఆయన పదవికి వెంటనే రామా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ముడా తనకు కేటాయించిన 14 ఇంటి స్థలాలు ఇలాంటి వివాదాలకు కారణం అవుతుందని తాను ఊహించలేదని, తన భర్త రాజకీయ జీవితానికి మచ్చ తీసుకువచ్చే ఆ ఇంటి స్థలాలు తనకు వద్దని, వాటిని తిరిగి ముడాకు ఇచ్చేస్తానని సీఎం సిద్దరామయ్య భార్య పార్వతి అంటున్నారు. సీఎం సిద్ధరామయ్య ఆయన భార్య పార్వతీ తదితరులపై కోర్టుకు ఫిర్యాదు చేసిన నటరాజ్ మంగళవారం మైసూర్ లో ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ తో మాట్లాడారు.
ఓ వ్యక్తి దొంగతనం చేసిన తర్వాత ఆ సొత్తును తిరిగి ఇచ్చేస్తే చేసిన తప్పు తప్పే అవుతుందని, ఆ తప్పు మాసిపోదని అన్నారు. సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతి ముడా నుంచి 14 సైట్లు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన తప్పుతప్పే అవుతుందని నటరాజ్ అన్నారు. ఇదే విషయంలో మూడు నెలల క్రితం ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని, అప్పుడే ఈ విషయం సమిసిపోయేదని నటరాజ్ అన్నారు.

ఆరోజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే సీఎం సిద్దరామయ్యతో పాటు ఎవరూ కోర్టు వరకు వెళ్లేవారు కాదని, కోర్టు సమయం వృధా అయ్యేదికాదని నటరాజన్ అన్నారు. కేవలం పద్నాలుగు ఇంటి స్థలాల కోసం సిద్ధరామయ్య ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చిందని, ఇది ప్రతిపక్షాల కుట్ర అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నారని సీఎం సన్నిహితులు ఆరోపిస్తున్నారు.
మొత్తం మీద సీఎం సిద్దరామయ్య భార్య 14 ఇంటి స్థలాలు ముడాకు తిరిగి ఇచ్చేస్తానని లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంపై కర్ణాటకలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం సిద్దరామయ్య సతీమణి పార్వతి 14 ఇంటి స్థలాలు తిరిగి ముడాకు ఇచ్చేస్తామని చెప్పడంతో ఆయన తప్పు చేశారని అంగీకరించినట్లు అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications