డ్రైవర్ నిర్లక్షం, డోర్ లో ఉన్న కండెక్టర్ ఏమయ్యాడంటే ?, క్షణంలో అంతా !
బెంగళూరు/మంగళూరు: రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వాలు. రవాణా శాఖ అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు నిర్లక్షం కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొందరు కావాలనే నిర్లక్షంగా వ్యవహరించి వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇలాగే ఓ కండెక్టర్ అతని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అతివేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఫుట్ బోర్డుపై నిల్చున్న కండక్టర్ రోడ్డుపై పడిపోవడంతో మృతి చెందిన సంఘటన కర్ణాటకలోని మంగళూరు నగరంలోని నంటూర్ సర్కిల్ లో చోటుచేసుకుంది. వాస్తవానికి బాగల్‌కోట్ జిల్లా కు చెందిన వ్యక్తి, ప్రస్తుతం సూరత్‌కల్ తాడంబైల్‌లో నివసిస్తున్న ఈరయ్య (23) అనే యువకుడు మృతి చెందాడు.

బస్సు కద్రి కేపీటీ వైపు నుంచి నంటూరు సర్కిల్ వద్ద మల్లికట్ట వైపు వేగంగా వచ్చిందిజ ఆ సమయంలో బస్సు డోర్ వద్ద నిలబడి ఉన్న కండక్టర్ ఈరయ్య కిందపడిపోయాడు. వెంటనే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ప్రజాప్రతినిధులు అతడిని ఆటో రిక్షాలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. అయితే తలకు బలమైన గాయం కావడంతో ఈరయ్య రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతి చెందాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. డ్రైవర్ బస్సు వేగంగా, నిర్లక్షంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్‌పై కద్రి ట్రాఫిక్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా నగరంలో తిరిగే అన్ని ప్రైవేట్ బస్సులకు డోర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కండక్టర్‌తో సహా ఎవరూ డోర్ వద్ద నిలబడొద్దని పోలీస్ కమిషనర్ కుల్‌దీప్ కుమార్ జైన్ బస్సు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications