కేంద్ర ప్రభుత్వానికి అహంకారం, ఆయన మీకంటే ముందే కేంద్ర మంత్రి తెలుసా ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిని ఢిల్లీలో బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు అవమానించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రిని కలవడానికి సమయం ఇచ్చిన తరువాత కూడా మూడు రోజుల పాటు కేంద్ర మంత్రిని కలవడానికి కర్ణాటక మంత్రి నిరీక్షించడం కేంద్ర ప్రభుత్వం అహంకారానికి పరాకాష్ట అని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది.
అయితే కేంద్ర మంత్రిని కలవడానికి మరో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం కర్ణాటకలో మంత్రిగా ఉన్న కేహెచ్. మునియప్ప మూడు రోజుల పాటు వేచి చూడటం హాట్ టాపిక్ అయ్యింది. 7 సార్లు వరుసగా ఎంపీగా విజయం సాధించి, కేంద్ర మంత్రిగా పని చేసిన కేహెచ్. మునియప్ప ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.

కేంద్ర మంత్రిగా పని చేసిన ఓ సీనియర్ నాయకుడిని ఢిల్లీలో బీజేపీ కేంద్ర మంత్రులు అవమానించారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది, కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖా మంత్రిని అవమానించిన కేంద్ర మంత్రి మొత్తం కన్నడిగులను అవమానించడమే' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నెలరోజుల సమయం కేటాయించిన బీజేపీ నాయకులకు ఇప్పుడు అదే కర్ణాటక ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం పంపిణి పథకంపై చర్చించే సమయం లేదా? లేక మీకు కాంగ్రెస్ పార్టీ హామీలు నచ్చలేదా? అని కూడా కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయుకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక ఒక్కటే ముఖ్యం కాదని, దేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయని, వాటి గురించి కూడా కేంద్ర ప్రబుత్వం పట్టించుకోవాలని కర్ణాటక నుంచి కన్నడిగులచే ఎన్నుకోబడిన ఓ ఎంపీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తునదని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రధాని నకేంద్ర మోదీకి కర్ణాటకలోని ప్రజల సమస్యలు పట్టించుకోవడం ముఖ్యమా, కాదా ? ఎన్నికలు వచ్చినప్పుడు మూడు రోజులకోసారి ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ నుంచి పరిగెత్తుకుని కర్ణాటకకు వచ్చి వీధుల్లో చెయ్యి ఊపిన మోదీకి ఇప్పుడు కర్ణాటక ప్రజల సమస్యలు గుర్తుకు రాలేదా ? అని కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులను ప్రశ్నించింది.
కర్ణాటక ముఖ్యం కాదని బీజేపీ నాయకులు అనుకుంటున్నారని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న కేహెచ్. మునియప్ప జరిగిన అవమానానికి తిగిన గుణపాఠం చెబుతామని కర్ణాటక కాంగ్రెస్ పాక్టీ నాయకులు అంటున్నారు












Click it and Unblock the Notifications