నర్సు మీద గ్యాంగ్ రేప్, చంపేసి శవాన్ని అంబులెన్స్ లో పెట్టి ?, డాక్టర్, ఉద్యోగుల స్కెచ్ !

బెంగళూరు: బీహార్‌లోని తూర్పు చంపారణ్య జిల్లాలో నర్సింగ్‌హోమ్‌లోని ఓ డాక్టర్, కాంపౌండర్, అదే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న ఇతర సిబ్బంది అక్కడ పనిచేస్తున్న నర్సుపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. సామాన్యులకు నమ్మకమైన వైద్యుడే ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ డాక్టర్ కనపడితే సినిమా చూపించాలని స్థానికులు అతని కోసం గాలిస్తున్నారు. చంపారణ్య జిల్లాలోని మోతీహరిలోని జానకీ సేవా సదన్ నర్సింగ్‌హోమ్‌లో ఈ ఘటన జరిగిందని, అదే ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌లో నర్సు మృతదేహం కనిపించడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు.

The doctor and hospital employees who gang-raped and killed the nurse and hid the body in the ambulance
ఆగస్టు 8వ తేదీన ఆస్పత్రిలో పని చెయ్యడానికి వెళ్లిన నర్సు తరువాత ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైయ్యింది. మాయం అయిన నర్సు కోసం తీవ్రస్థాయిలో ఆమె కుటుంబ సభ్యులు వెతికారు. చివరికి నర్సింగ్ హోమ్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి కనపడకుండా పోయిన నర్సు అంబులెన్స్‌లో ఆమె మృతదేహం కనిపించడంతో అందరూ హడలిపోయారు.

నర్సు శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. తరువాత నర్సు మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు కాంపౌండర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న డాక్టర్‌తో పాటు ముగ్గురు నిందితుల కోసం వెతుకుతున్నారు. నర్సు పని చేస్తున్న నర్సింగ్‌హోమ్‌ను సీజ్ చేశారు.

The doctor and hospital employees who gang-raped and killed the nurse and hid the body in the ambulance

డాక్టర్ జయప్రకాష్ దాస్ తో సహా ఐదుగురిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. వైద్యులు మరియు ఇతరుల వేధింపులతో విసిగిపోయిన నర్సు గత కొంతకాలం ముందుగానే పనికి వెళ్లడం మానేసింది. అయితే మరోసారి ఇలాంటివి జరగకుండా చూస్తానని ఆమెకు డాక్టర్ తో పాటు అక్కడ పని చేసే ఉద్యోగులు క్షమాపణలు చెప్పారని, తరువాత ఆమె ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఈ మాయమాటలు నమ్మి తిరిగి విధుల్లో చేరిన నర్సు మీద అక్కడ పని చేసే వైద్యుడు కక్ష పెంచుకుని ఈ చర్యలకు పాల్పడ్డాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వితంతువు అయిన నర్సుకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని, ఆమె భర్త చనిపోవడంతో ఆ నర్సు తల్లి వద్దే ఉంటోందని, నర్సు మీద సామూహిక అత్యాచారం చేసి తరువాత ఆమెను హత్య చేశారని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+