ప్రతిపక్షంలో చేరిన పోలీసు అధికారులు, పని లేని మంగళోడు ఏం పని చేస్తాడని ప్రశ్నించిన ఎంపీ !

భారతీయ జనతా పార్టీలో (బీజేపీ)లో చేరారు అనే ఆరోపణలపై ఇద్దరు తమిళనాడు సబ్ ఇన్‌స్పెక్టర్లను బుధవారం రాత్రి రాష్ట్ర సాయుధ దళాలకు బదిలీ చేశారు. బదిలీ అయిన సబ్ ఇన్‌స్పెక్టర్లను రాజేంద్రన్, కార్తికేయలుగా గుర్తించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా ఎన్ మన్ ఎన్ మక్కల్ (నా నేల, నా ప్రజలు) యాత్రలో భాగంగా తంజావూరు జిల్లాలో పర్యటించారు.

తంజావూరు జిల్లా పర్యటనకు వచ్చిన అన్నామలై సమక్షంలో ఇద్దరు పోలీసు అధికారులు బీజేపీలో చేరినట్లు సమాచారం. డిసెంబరు 27వ తేదీన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో అన్నామలై యాత్ర సందర్భంగా ఈ పోలీసు అధికారులు భద్రత కోసం నియమించారు. బదిలీ అయిన ఎస్‌ఐలు రాజేంద్రన్, కార్తికేయలు పోలీసు యూనిఫాంలోనే బీజేపీలో చేరారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

The government transferred the police officers accusing them of joining the BJP in police uniform

బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై యాత్ర సందర్భంగా తంజావూర్ జిల్లాలోని లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేస్తున్న పోలీసు అధికారులను బందోబస్తు డ్యూటీకి కేటాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తంజావూరు డీఐజీ స్పెషల్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రన్, కార్తికేయన్‌లను నాగపట్నం సాయుధ దళాల విభాగానికి బదిలీ చేశారు. దీనికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని డీఐజీ మీడియాకు చెప్పారు.

ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాకు చెందిన గణేశన్ అనే పోలీసు కానిస్టేబుల్ అన్నామలైతో సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత కానిస్టేబుల్ గణేశన్ ను కూడా సాయుధ దళాలకు బదిలీ చేశారు దయానిధి మారన్‌పై అన్నామలై విరుచుకుపడ్డారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ బీజేపీ ఐటీ విభాగాన్ని నిరుద్యోగ క్షురకులు అంటూ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

దీనిపై స్పందించిన అన్నామలై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎంకే ఎంపి దయానిధి మారన్ మాట్లాడిన తీరు ఆయన సంస్కారానికి నిదర్శనం అని అన్నామలై కౌంటర్ ఇచ్చారు. ఒకరి వృత్తి లేదా భాష కారణంగా తక్కువగా చూడటం గొప్ప విషయం అనుకుంటున్న డీఎంకే ఎంపీ దయానిది మారన్ ప్రజల్లోకి వెళితే తగిన బుద్ది చెప్పి పంపిస్తారని అన్నామలై మండిపడ్డారు.

The government transferred the police officers accusing them of joining the BJP in police uniform

సోషల్ మీడియా పోస్ట్‌లపై స్పందించిన దయానిధి మారన్ బీజేపీ ఐటీ శాఖను నిరుద్యోగ క్షురకులుగా అభివర్ణించారు. మంగలి పని లేకుంటే ఆ మంగళోడు పిల్లికి షేవింగ్ చేస్తూ కాలం గడిపేస్తాడనే అనే సామెత ఉంది. అదే విధంగా బీజేపీ ఐటీ శాఖకు కూడా చేసేదేమీ లేదని, అందుకే నా పాత వీడియోలను లీక్ చేస్తోందని ఆరోపిస్తూ వారిని పనిలేని మంగళోళ్లు అంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆదివారం చెన్నైలో విలేకరులతో అన్నారు.

దీంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు దయానిధి మారన్‌పై మండిపడుతున్నారు. ఒక కులాన్ని కించపరిచిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడిన తీరు ఆయన సంస్కృతిని తెలియజేస్తోందని దయానిధి మారన్ పై క్షురకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+