ప్రియుడితో రొమాన్స్ చెయ్యడానికి విడాకులు ఇస్తోందని బస్ స్టాండ్ లో భార్యను ఏం చేశాడంటే ?

బెంగళూరు/చిత్రదుర్గ: పగలు, రాత్రి అని తేడాలేకుండా నిద్రపోయే వరకు భార్యాభర్తలు గొడవ పడతారని ఓ సామెత ఉంది. ఇక్కడ ఓ దంపతుల మధ్య నిత్యం గొడవలు ఎక్కువ కావడంతో వారి గొడవలకు హద్దుఅదుపు లేకుండాపోయింది. భార్య మీద భర్తకు విపరీతమైన అనుమానం. పంచాయితీ కోర్టు వరకు వెళ్లింది. అయితే బస్ స్టాండ్ లో భార్యపై భర్త కొడవలితో దారుణంగా దాడి చేశాడు.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ ఎదురుగా రోడ్డు మీద ఓ మహిళను ఆమె భర్త కొడవలితో ఇష్టం వచ్చినట్లు నరికేయడంతో ఆమె కుప్పకూలిపోయింది. మరోవైపు స్థానికులు ఆమె భర్తను పట్టుకుని చితకబాదుతున్నారు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు మొదట గందరగోళానికి గురైనారు. చెళ్లకెరె తాలూకా హెగ్గెరు గ్రామానికి చెందిన ఆశా, కుమారస్వామి అనే యువకుడికి నాలుగేళ్ల క్రితమే వివాహమైంది.

The husband attacked his wife with a machete at the bus stand for having an illicit relationship

పెళ్లయిన రెండేళ్లు కుమారస్వామి అతని భార్య ఆశాతో చాలా సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా నడిపించాడు. రెండేళ్లు గడిచిన తర్వాత కుమారస్వామి అతని భార్య ఆశా మీద దాడి చెయ్యడం మొదలుపెట్టాడు. తనకంటే అందంగా ఉన్న భార్య ఆశా శీలం మీద కుమారస్వామికి అనుమానం ఎక్కువ కావడంతో అతని కాపురంలో లేనిపోని గొడవలు మొదలైనాయి.

కుమారస్వామి ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అయ్యాయి. భర్త కుమారస్వామి ఎంత నీచుడైనా ఈరోజు కాదు రేపు బాగుపడుతాడని అతని భార్య ఆశా చాలాకాలం పాటు అతని చిత్రహింసలు భరించింది. నిందితుడు రోజూ మద్యం తాగి ఇంటికి వెళ్లి అతని భార్య ఆశాను మానసికంగా, శారీరకంగా హింసించడంతోపాటు నిత్యం గొడవపడేవాడని ఆశా కుటుంబ సభ్యులు, స్థానిక గ్రామస్తులు అంటున్నారు.

చివరికి విసిగిపోయిన ఆశా తన భర్త కుమారస్వామి సహవాసం వద్దు అంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. గత ఏడాది నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కోర్టు తీర్పు అందుకోవడానికి బుధవారం ఆశా కోర్టు ముందు హాజరుకావడానికి వెళ్లింది. తన భార్య ఆశా కోర్టుకు వస్తోందని తెలుసుకున్న కుమారస్వామి బ్యాగ్ లో కొడవలి పెట్టుకుని బైక్ లో ఆమెకు తెలీకుండా వెంబడించాడు.

చివరికి కుమారస్వామి చెళ్లకెరె ప్రైవేట్ బస్టాప్ వద్దకు వెళ్లి అటువైపు నడుచుకుంటూ వస్తున్న అతని భార్య ఆశా మీద అకస్మాత్తుగా కొడవలితో దాడి చేశాడు. ఆశా తప్పించుకోకుండా నిమిషంలో ఆమెను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. విషయం గుర్తించిన స్థానికులు ధైర్యం చేసి కుమారస్వామిని పట్టుకుని అతని చేతిలోని కొడవలి లాక్కొని అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాదేశాడు. తీవ్రగాయాలైన ఆశాను చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

The husband attacked his wife with a machete at the bus stand for having an illicit relationship

కుమారస్వామిని చితకబాది అతన్ని పోలీసులకు అప్పగించారు. ఆశా పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె చావుబతుకుల మధ్య పోరాడుతోందని పోలీసులు అంటున్నారు. తన కూతురు ఆశా మీద హత్యయత్నం చేసిన తన అల్లుడు కుమారస్వామిని కఠినంగా శిక్షించాలని గాయపడిన మహిళ తండ్రి డిమాండ్ చేశారు. సైకో కుమారస్వామికి పెళ్లయిన రెండేళ్లకే అతని భార్య ఆశా శీలంపై అనుమానం పెంచుకున్నాడని బాధితురాలి తండ్రి అంటున్నారు.

ఆశా ఇంట్లో నుంచి బయటకు రాకుండాచేసి ఆమె మీద నిత్యం దాడి చేసేవాడని, ఇదంతా చూసి అతనితో కాపురం చెయ్యవద్దని మేమే ఆశాకు చూసించామని, భర్తతో విడిపోవాలని ఆశా కూడా డిసైడ్ అయిన తరువాత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించామని ఆశా తల్లిదండ్రులు అంటున్నారు. అక్రమ సంబంధం కారణంగానే తన భార్య ఆశా తనకు విడాకులు ఇస్తోందని కోపంతో ఆమెను నడిరోడ్డులో చంపేయడానికి కుమారస్వామి ప్రయత్నించాడని పోలీసులు అంటున్నారు బాదితురాలు ఆశా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+