230 కిలోమీటర్లు ప్రయాణించి మరీ... భార్యను చంపిన భర్త...
భార్యను చంపేందుకు ఓ భర్త ఏకంగా 230కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. పదే పదే ఫోన్ చేసినా భార్య ఫోన్ తీయకపోవడంతో కోపోద్రికుడైన పోలీసు కానిస్టేబుల్ భార్యకోసం 230 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆమెను అతి కిరాతంగా చంపేసాడు.
డెలివరీకి పుట్టింటికి వచ్చిన ప్రతిభ : బెత్తహలసూర్‌కు చెందిన ప్రతిభకు కోలార్ జిల్లా వీరపుర గ్రామానికి చెందిన కిషోర్ తో నవంబర్12,2022న వివాహం జరిగింది. కిషోర్ భార్య ప్రతిభ క్యారెక్టర్ పై అనుమానం రావడంతో ఆమెకు ఫోన్ కు వస్తున్న మెసేజులు, కాల్స్ వివరాలను చెక్ చేస్తూ ఉండేవాడు. ప్రతిభకు మెస్సేజ్ లు, కాల్స్ చేస్తున్న వ్యక్తుల గురించి ఆమెను ప్రశ్నించాడు. ప్రతిభ కొంతమంది మగవారితో సన్నిహితంగా ఉన్నట్లుగా గమనించాడు పోలీస్ కానిస్టేబుల్. అయితే ఈ క్రమంలో కిషోర్ భార్య ప్రతిభ డెలివరీకి పుట్టింటికి వెళ్లింది. 11 రోజుల క్రితం పుట్టినిల్లైన హోస్ కోటే దగ్గర్లోని కాలాతూర్ లో ఓ శిశువుకు జన్మనిచ్చింది.

అనుమానంతో భార్యను తిట్టిన భర్త : పోలీసులు వివరాల ప్రకారం... ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏదో సందర్భంలో తిట్టడం మొదలుపెట్టాడు. దానికి ప్రతిభ ఫోన్ మాట్లాడుతూనే ఏడ్చింది. ఇది గమనించిన ప్రతిభ తల్లి వెంకటలక్ష్మమ్మ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసింది. ఈ సమయంలో ఏడిస్తే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రతిభకు నచ్చజెప్పింది తల్లి. అంతేకాకుండా కిషోర్ ఫోన్ చేస్తే లిప్ట్ చేయొద్దని, సమాధానం ఇవ్వొద్దని ప్రతిభకు చెప్పి వెళ్లింది తల్లి. దాంతో ఫోన్‌ను పక్కన పడేసింది ప్రతిభ. అయితే, కిషోర్ మాత్రం మాట్లాడుతూ ఉంటే కాల్ కట్ చేసిందనే కోపంతో పదే పదే ప్రతిభకు ఫోన్ చేశాడు. అలా దాదాపు 150 సార్లు భార్యకు ఫోన్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో సహనం కోల్పోయాడు. మరుసటిరోజు ఉదయం ప్రతిభ ఫోన్ చూడగా కిషోర్ 150 సార్లు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది ప్రతిభ.
చున్నీతో భార్య గొంతును పిసికి చంపిన భర్త : 150 సార్లు ఫోన్ కాల్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో ప్రతిభ ఇంటికి బయలుదేరాడు కిషోర్. కిషోర్ ఉంటున్న చామరాజనగర్ నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న భార్య పుట్టినిల్లైన హోస్ కేటేకి హుటాహుటినా బయలుదేరాడు. అయితే, ఇంట్లోకి వెళ్లిన కిషోర్ మొదట తను పురుగుల మందు తాగి, ఆ తర్వాత చున్నీతో భార్య గొంతును పిసికి చంపేశాడు. ఆ ఘటనలో ప్రతిభ మరణించింది. నిందితుడి కిషోర్ పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. అతన్నీ చికిత్స నిమిత్తం కోలార్ తమాకలోని ఆర్ఎల్ జలప్ప ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమించగా, మెరుగైన చికిత్స కోసం హోస్ కేటే పోలీసులు అతన్ని మరో ఆస్పత్రికి తరలించారు. కిషోర్ డిశ్చార్జ్ అయిన తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications