మాజీ సీఎంకు రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. రాష్ట్ర మహిళా కమిషన్ జారీ చేసిన హెచ్‌డీ కుమారస్వామికి ఇచ్చిన నోటీసులపై కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసును ప్రశ్నిస్తూ మాజీ సీఎం, జేడీఎస్ కర్ణాటక శాఖ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు కుమారస్వామికి ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది.
పిటిషన్ విచారణ పరిష్కరించే వరకు నోటీసుపై తాత్కాలికంగా స్టే విధిస్తున్నామని కర్ణాటక హైకోర్టు తెలిపింది. కర్ణాటక
మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామికి రాష్ట్ర మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం స్టే విధించింది. మహిళా కమిషన్ నోటీసును సవాల్ చేస్తూ హెచ్‌డీకే కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు నోటీసుపై స్టే విధించింది. ఇదే సమయంలో
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు నోటీసులు ఇచ్చింది.

హెచ్ డీ కుమారస్వామి పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
తుమకూరు జిల్లా తురువేకెరెలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఉచిత హామీలపై హెచ్ డీ కుమారస్వామి విమర్శలు గుప్పించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత హామీ పథకాల వల్ల గ్రామాల్లో మహిళలు దిక్కుతోచని స్థితిలో పక్కదారి పడుతున్నారని మాజీ సీఎం కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు.
గ్రామాల్లోని మహిళల జీవితం ఎలా ఉండాలో ఆలోచించాలని హెచ్ డీ కుమారస్వామి తన ప్రసంగంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
హెచ్‌డీ కుమారస్వామి ఆరోపణలు కర్ణాటకలో కలకలం రేపాయి. ఇదే సమయంలో మాజీ సీఎం కుమారస్వామి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. దీంతో పాటు దీనిపై వివరణ ఇవ్వాలని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications