ఒకే ఫ్యామిలీలో నలుగురిని చంపేసి కత్తి వంట గదిలో పెట్టాడు. భార్యకు డౌట్ రాకుండా ?
బెంగళూరు: కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఒకే ఫ్యామిలీలో నలుగురిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు పలుకోణాల్లో విచారణ చేశారు. ఒకే కుటుంబంలోని నలుగురిని హత్య చెయ్యడానికి నిందితుడు చాలా రోజుల నుంచి ప్లాన్ చేశాడు. హత్యకు గురైన వారి ఇంటిలోకి వెళ్లిన నిందితుడు కేవలం 15 నిమిషాల్లోనే అందరిని దారుణంగా హత్య చేసి దర్జాగా అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఆటోలో వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడని వెలుగు చూసింది.
కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ గురువారం మీడియా సమావేశంలో హంతకుడు ప్రవీణ్ గురించి వివరాలు చెప్పారు. ఉడిపిలో ఒకే కుటుంబంలోని నలుగురిని ప్రవీణ్ దారుణంగా హత్య చేశాడని జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ తెలిపారు. నలుగురి హత్యకు ఉపయోగించిన కత్తితో నేరుగా ఇంటికి వెళ్లిన ప్రవీణ్ ఆ కత్తిని అతని ఇంటి వంట గదిలో దాచిపెట్టాడని, అతని భార్యకు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకున్నాడని ఉడిపి జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ చెప్పారు.

ప్రవీణ్ కు, అయ్నాజ్ అనే మహిళకు 8 నెలల క్రితం పరిచయం అయ్యింది. అయితే రెండు నెలల నుంచి అయ్నాజ్, ప్రవీణ్ మాట్లాడుకోవడం లేదని వచారణలో వెలుగు చూసింది జిల్లా ఎస్పీ డాక్టర్ అరుణ్ అన్నారు. యత్నాజ్ కుటుంబ సభ్యులను హత్య చెయ్యడానికి ప్రవీణ్ అతని కారులోనే బయలుదేరాడని, అయితే కారును పడుబిదరి టోల్ గేట్ కు ముందే పార్క్ చేశాడని, టోల్ గేట్ లో అతని కారు నెంబర్ నోట్ కాకుండా చూసుకుని తరువాత అక్కడి నుంచి బస్సులో వెళ్లాడని పోలీసుల విచారణలో వెలుగు చూసిందని ఉడిపి జిల్లా ఎస్పీ అరుణ్ తెలిపారు.













Click it and Unblock the Notifications