ఫస్ట్ భార్య కొడుకుతో సమస్య, ఆంటీ ఏం చేసింది అంటే, మ్యాటర్ రివర్స్ తో !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ హత్య జరిగింది. తన జీవన భాగస్వామి మొదటి భార్యకు పుట్టిన 11 ఏళ్ల మైనర్ కొడుకును హత్య చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 24 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. పూజా కుమారి అరెస్టు అయిన మహిళ ఆమె జీవిత భాగస్వామి అయిన భర్త మధ్య జరిగిన మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు.

భర్త విడాకులు ఇవ్వడానికి నిరాకరించాడనే కారణంతో అతని 11 ఏళ్ల కుమారుడిని చంపి బాలుడి మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో పెట్టింది. వివాహం చేసుకున్న జీతేంద్ర తనకు కొడుకు ఉన్నందువలనే మొదటి భార్య కొడుకు కోసం తనకు విడాకులు ఇవ్వలేదని పూజ భావించింది. నిద్రిస్తున్న బాలుడి గొంతుకోసి చంపేసింది. బాలుడి మృతదేహాన్ని బెడ్‌కింద ఉన్న బెడ్ బాక్స్‌లో పెట్టి మూసేసింది.

The lady who brutally murdered the son of her husbands first wife and put it in a box under the bed in Delhi.

ఈ ఘటనపై ఇందర్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 8.30 గంటలకు బీఎల్ కే హాస్పిటల్ నుండి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకువస్తుండగా బాలుడు మరణించాడని, అతని మెడ దగ్గర గాయాల గుర్తులు ఉన్నాయని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.

ఈ సమయంలో పూజా కుమారి చిన్నారి ఉన్న ఇంటికి వెళ్లిన దృశ్యం రికార్డయింది. బాలుడు నిద్రిస్తున్న సమయంలో హత్య చేసి మృతదేహాన్ని బెడ్‌కింద బెడ్‌బాక్స్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 300 సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.

బాలుడిని హత్య చేసిన పూజ, అబ్బాయి తండ్రి జితేంద్రను 2019 అక్టోబర్ 17న ఆర్యసమాజలో వివాహం చేసుకుంది. పూజా వివాహం సమయంలో, జీతేంద్ర తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకోలేదు, ఆర్యసమాజ్‌లో వివాహం సందర్భంగా, అతను తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత కోర్టు వివాహం చేసుకుంటానని పూజకు వాగ్దానం చేశాడు.

The lady who brutally murdered the son of her husbands first wife and put it in a box under the bed in Delhi.

ఆ తర్వాత పూజా, జితేంద్ర ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే మొదటి భార్యకు విడాకుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ గొడవలో జితేంద్ర మొదటి భార్యకు విడాకులు ఇవ్వనని చెప్పాడు. అంతేకాదు పూజా ఇంటిని వదిలి మొదటి భార్యతో కలిసి జీవించడం ప్రారంభించాడు. దీంతో పూజకు మరింత కోపం వచ్చింది.

గత డిసెంబర్‌లో జితేంద్ర పూజా ఇంటిని విడిచిపెట్టడం పూజకు మరింత కోపం తెప్పించింది. కొడుకు కారణంగానే జీతేంద్ర తనను విడిచిపెట్టాడని భావించిన పూజ.. తనను కలుసుకుని జీతేంద్ర ఇంటికి తీసుకెళ్లాలని స్నేహితులను కోరింది. దీని ప్రకారం ఇందర్‌పురిలోని జేజే కాలనీలోని జితేందర్ ఇంటికి స్నేహితులతో కలిసి వెళ్లిన సమయంలో జీతేంద్ర కుమారుడు బిట్టు నిద్రపోతున్నాడు.

ఆ సమయంలో అతన్ని చంపేశారని పోలీసులు తెలిపారు. అనంతరం అతడి బెడ్‌బాక్స్‌లోని బట్టలు తీసి బాలుడి మృతదేహాన్ని అందులో వేసి తలుపులు వేసి అక్కడి నుంచి పారిపోయింది. సాధారణంగా, తండ్రి అక్రమ సంబంధానికి కొడుకు జీవితాన్ని సవతి తల్లి నాశనం చెయ్యడం ఢిల్లీలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+