భర్త IAS.. భార్య IPS.. వీళ్ల లవ్ స్టోరీకి బాలీవుడ్ సైతం ఫిదా..!
భర్త IAS.. భార్య IPS.. వీళ్ల లవ్ స్టోరీ, లైఫ్ స్టోరీ ముందు బాలీవుడ్ లవ్ స్టోరీస్ కూడా తక్కువే. తుషార్ సింగ్లా ఐఏఎస్, నవ్ జ్యోత్ సిమి ఐపీఎస్ ల పరిచయం.. స్నేహంగా మారింది. అలా వారి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ కేంద్రం హోదాలో పెద్ద ఆఫీసర్స్. కానీ వీరి వివాహం మాత్రం వాలెంటైన్స్ డే రోజున ఆఫీస్ లో సాధారణంగా జరిగింది. ముఖ్యంగా మనదేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు పెట్టినంత ఖర్చు మరే సందర్భంలోనూ ఉండదు. కానీ ఈ ఆఫీసర్లు మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. సింప్లిసిటీ పేరుతో వీరి వివాహం హడావిడి, ఆడంబరాలు లేకుండా జరిగింది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తుషార్ సింగ్లా, నవ్ జ్యోత్ సిమి.. తమ జీవనవిధానం, కెరీర్, సక్సెస్ ద్వారా ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోవడం, ఆలోచనలు, లక్ష్యాలను పంచుకోవడం గురించి వివరిస్తున్నారు.
లవ్ స్టోరీ ఎలా మొదలైంది..
తుషార్ సింగ్లా మొదట ఐపీఎస్ సాధించినప్పుడు నవ్ జ్యోత్ గురించి తెలిసింది. ఐపీఎస్ ట్రైనింగ్ లోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ స్నేహం బలపడింది. ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. ట్రైనింగ్ అనంతరం పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఫిబ్రవరి 14, 2020న తుషార్.. నవ్ జ్యోత్ పనిచేసే బెంగాల్ లోని తన ఆఫీస్ కు వెళ్లారు. అక్కడే వారి వివాహం కొద్ది మంది స్నేహితులు, ఉద్యోగుల మధ్య జరిగింది. ఆ తర్వాత ఆ ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పుడు సోషల్ మీడియాలో వారిని అందరూ ప్రశంసించారు. ఆఫీసర్స్ అయినా ఇలా చాలా సింపిల్ గా మ్యారేజ్ చేసుకున్నారని కామెంట్స్ పెట్టారు.

ఐపీఎస్ నవ్ జ్యోత్ ..పంజాబ్ లోని గురుదాస్ పుర్ కు చెందినవారు. సివిల్స్ లోకి రాకముందు ఆమె డెంటిస్ట్ గా పనిచేశారు. అనంతరం సివిల్స్ పరీక్ష రాసి ఐపీఎస్ అయ్యారు. 2017లో ఆమె సివిల్స్ పరీక్ష రాయగా దేశవ్యాప్తంగా 735 వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ క్యాడర్ కు సెలెక్ట్ అయ్యారు. ఇక ఐఏఎస్ తుషార్ కూడా పంజాబ్ కు చెందినవారే. ఆయన చిన్నప్పటి నుంచి టాపరే. బీటెక్ దిల్లీ ఐఐటీలో చదివారు. ఆ తర్వాత 2015లో సివిల్స్ రాసి దేశవ్యాప్తంగా 86వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు. వీరి లవ్ స్టోరీ, సింప్లిసిటీ, సమాజానికి సేవ చేయాలనే తపన, సక్సెస్ జర్నీ.. ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటోంది.












Click it and Unblock the Notifications