లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ మృతి... ఈయన నేతృత్వంలోనే భారత్‌కు ఆ విజయం
పంచకుల: దేశ విభజన తర్వాత సియాచిన్ భారత్‌కు దక్కడంలో కీలకంగా వ్యవహరించిన లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పీఎన్ హూన్ పంచకులాలో సోమవారం సాయంత్రం 6:30 గంటలకు మృతి చెందినట్లు ఆయన కుమారుడు రానీ హూన్ చెప్పారు.

విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ మేఘ్‌దూత్
దేశ విభజన తర్వాత సిక్కు రెజిమెంట్‌లో ఆయన లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ మూన్ విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే సియాచిన్ ప్రాంతం కోసం భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగి ఆ ప్రాంతాన్ని భారత్ కైవసం చేసుకుంది. దీనికే ఆపరేషన్ మేఘ్‌దూత్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ మేఘ్‌దూత్‌కు అప్పట్లో నాయకత్వం వహించారు ప్రేమ్‌నాథ్ హూన్. శ్రీనగర్ బేస్‌లోని 15 కార్ప్స్‌కు కమాండర్‌గా పనిచేసి 1984లో సియాచిన్ ప్రాంతం భారత్ కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.

1965లో పాక్‌పై యుద్ధంలో సేనాధిపతిగా...
1965లో సేనాధిపతిగా భారత్ చైనా సరిహద్దుల్లో పనిచేశారు. అంతేకాదు పాకిస్తాన్‌పై అదే ఏడాది జరిగిన యుద్ధంలో కూడా ప్రేమ్‌నాథ్ హూన్ ముందుండి నడిపించారు. మిలటరీ ఆపరేషన్స్‌కు డైరెక్టర్ జనరల్‌గా కూడా సేవలందించారు. తన చివరి శ్వాస వరకు భారత దేశం కోసమే ఆయన కలలు కన్నారని కొనియాడారు వెస్ట్రన్ కమాండ్ మాజీ చీఫ్ రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజే సింగ్. ఆపరేషన్ మేఘ్‌దూత్‌ను వియజవంతంగా నిర్వహించారని చెప్పారు. సియాచిన్ ప్రాంతం భారత్‌కు దక్కడంలో లెఫ్ట్‌నెంటె జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ పాత్ర మరువలేనిదని చెప్పారు. నేటి యువత ఒక మంచి మార్గదర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు లెఫ్ట్‌నెంట్ జనరల్ కేజే సింగ్. అంతేకాదు తాను ఒక ఎన్జీఓను కూడా నడిపాడని దీని ద్వారా దేశ సమగ్రతను కాపాడే వారని కేజే సింగ్ చెప్పారు.

దేశానికి సియాచిన్ అందించిన గొప్ప వీరుడు
సియాచిన్ కోసం జరిగిన యుద్ధంలో సరైన ఆయుధాలు, బలగం లేకపోయినప్పటికీ దేశానికి విజయాన్ని అందించడంలో ప్రేమ్‌నాథ్ హూన్ కీలకంగా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు మరో రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎస్ ధిల్లాన్. నాడు ప్రేమ్‌నాథ్ దేశానికి సియాచిన్ అందించారని ఇప్పటికీ అది భారత్ చేతిలోనే ఉందని కొనియాడారు. తను జీవితంలో దేశానికి సాధించిన అద్భుతమైన విజయం సియాచిన్ అని చెప్పారు రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎస్ ధిల్లాన్.

1929లో అబోటాబాద్‌లో జన్మించిన ప్రేమ్‌నాథ్ హూన్
ఇదిలా ఉంటే రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ప్రేమ్‌నాథ్ హూన్ 1929లో అబోటాబాద్‌లో జన్మించారు. 1947లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడెమీలో చేరారు. తన లక్ష్యం ఏమిటో తనకు తెలుసని దాన్ని సాధించేందుకు నిర్ణయించుకునే ముందుకు వెళ్లి సియాచిన్ ప్రాంతంను కైవసం చేసుకున్నామని గతేడాది జూన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ప్రేమ్‌నాథ్. సియాచిన్ ప్రాంతాన్ని భరతమాతకు బహుమతిగా ఇస్తే అది జీవితాంతం గుర్తుండిపోతుందని భావించి కొంత కష్టమైనా సరే అనుకున్న లక్ష్యాన్ని సాధించామని చెప్పుకొచ్చారు ప్రేమ్‌నాథ్.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
లీటర్ పెట్రోల్ రూ. 321, కిరోసిన్ రూ. 433, డీజిల్ రూ. 345.. ఎమర్జెన్సీ ప్రకటన.. -
Pakistan: ఏప్రిల్ 4 నుంచి లాక్ డౌన్..? సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications