రేప్ కేసు పెట్టడానికి వెళ్లిన యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఎస్ఐ !
బెంగళూరు: లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలిని ఎస్ఐ లైంగికంగా వేధించిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. బెంగళూరు నగరంలోని బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కేటీ సతీష్‌పై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు.
కొద్దిరోజుల క్రితం ఓ యువతి తన మీద స్నేహితుడు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసేందుకు బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఫిర్యాదుపై సరైన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎస్ఐ సతీష్ లంచం డబ్బు కోసం నిందితులకు సహకరించాడు. అలాగే బాధితురాలి నుంచి మొబైల్‌ను లాక్కుని సాక్ష్యాలను ధ్వంసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల వేధింపులపై బాధితురాలు బెంగళూరు నగర కమిషనర్ బి.దయానంద ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఓ సీనియర్ పోలీసు అధికారితో రహస్యంగా విచారణ జరిపించాలని డిసైడ్ అయ్యారు. యువతి ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని బెంగళూరు పశ్చిమ డివిజన్ డీసీపీ లక్ష్మణ్ నింబరగిని ఆదేశించారు. డీసీపీ నివేదిక ఆదారంగా కామాంధుడైన ఎస్ఐ సతీష్ ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు. ఎస్ఐ సతీష్ మీద అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
కలబరగిలోని అఫ్జల్‌పురా పట్టణంలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో ముగ్గురు నిందితులు బాలుడి అసహజ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఫ్జల్‌పురా పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అసహజ సెక్స్ చేసే సమయంలో మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన వీడియోను చూసిన పోలీసులు శివానంద అంబిగారు, అనీలా అంబిగేరా, కార్తీక్ అనే ముగ్గురు వ్యక్తుల మీద కేసున నమోదు చెయ్యడంతో నిందితులు పరారైనారు.












Click it and Unblock the Notifications