రగులుతోంది మొగలిపొద: నడుం నాజూకుగా ఉందని గిల్లిన ఎస్‌ఐ.. ఆ తర్వాత..!

బెంగళూరు/న్యూఢిల్లీ: పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కామాంధుడు అని తెలిసింది. వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటున్న స్నేహితుల కేసులో పోలీసుల ముందు స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఓ మహిళ వెళ్లింది. అంతే పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని కూడా ఆలోచించకుండా ఆ మహిళ నడుం చూసి రగిలిపోయిన ఎస్ఐ ఆమె నడుం మీద చేతులు వేసి గిల్లేశాడు.

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న దంపతులు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ కేసులో స్టేట్ మెంట్ ఇవ్వడానికి బెంగళూరలో నివాసం ఉంటున్న మహిళ సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. సుద్దగంటపాళ్య పోలీస్ స్టేషన్ లో మంజునాథ్ అనే వ్యక్తి ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు.

విడాకుల కేసులో స్టేట్ మెంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన మహిళ అందచందాలు చూసి ఎస్ఐ మంజునాథ్ జోల్లు కార్చుకున్నాడు. మల్లెపువ్వు తీగలాంటి సన్నటి ఆమె నడుం చూసిన ఎస్ఐ మంజునాథ్ కామంతో తట్టుకోలేకపోయాడు. ఎర్రగా, పొడవుగా, నాజుకుగా ఉన్న మహిళను చూసిన ఎస్ఐ మంజునాథ్ అతని కుర్చిలో నుంచి లేచి ఆమె దగ్గరకు వెళ్లాడు.

weaistpinching-

మహిళ దగ్గర స్టేట్ మెంట్ తీసుకోకుండా మొదట ఆమె నడుం మీద చేతులు వేసి ఆమె నడుం గిల్లేశాడు. మహిళ శరీరం మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ మంజునాథ్ ఇప్పుడు ఎలా ఉందో చెప్పు అంటూ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎస్ఐ చేష్టలతో విసిగిపోయిన మహిళ పోలీస్ స్టేషన్ లో నుంచి బయటకు వెళ్లిపోయింది.

అర్దరాత్రి మహిళ వాట్సాప్ నెంబర్ కు అసభ్యంగా మెసేజ్ లు పంపించిన ఎస్ఐ మంజునాథ్ ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేశాడని తెలిసింది. ఎస్ఐ మంజునాథ్ తీరుతో విసిగిపోయిన మహిళ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ట్విట్టర్ అకౌంట్ లో జరిగిన మ్యాటర్ మొత్తం వివరించి పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేసింది.

ఈ విషయంలో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి సీరియస్ అయ్యి ఏసీపీ ర్యాంక్ అధికారితో విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చెయ్యాలని బాధితురాలికి సూచించారు. బుధవారం సాయంత్రం బాధితురాలు సుద్దగుంటపాళ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐ మంజునాథ్ మీద లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి కేసు పెట్టింది.

police

పోలీసు అధికారుల విచారణలో ఎస్ఐ మంజునాథ్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని వెలుగు చూడటంతో బెంగళూరు పోలీసు కమీనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐని సస్పెండ్ చేశామని డీసీపీ సీకే బాబా గురువారం మీడియాకు చెప్పారు. ఎస్ఐ మంజునాథ్ ను ఇంటికి పంపించిన బెంగళూరు పోలీసు అధికారులు మహిళ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. గతంలో కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలతో ఎస్ఐ మంజునాథ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+