Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

owner: ఇంటి ఓనర్, ఆయన భార్యను గొడ్డలితో నరికి చంపేసిన యువకుడు, తల్లితో ఇంతకాలం ?

ముంబాయి/పూణే: తల్లీదండ్రులతో ఓ యువకుడు ఓ అద్దె ఇంటిలో చాలా సంవత్సరాలు నివాసం ఉన్నారు. కొడుకు బాగా చదువుకుని గ్రూప్ వన్ పోటీ పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకుంటున్నాడు. తండ్రి పనుల మీద ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. తల్లి ఇంట్లో ఉంటున్నది. కోచింగ్ తీసుకోవడానికి కొడుకు బయట ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఆ ఫ్యామిలీ వేరే ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. పాత ఇంటి ఓనర్ తో పాటు అతని భార్య దారుణ హత్యకు గురైనారు. ఈ కేసులో గ్రూప్ వన్ పరీక్షలు రాయడానికి ప్రయత్నిస్తున్న యువకుడు అరెస్టు కావడం, జంట హత్యలు ఎందుకు జరిగాయి అనే విషయం బయటకు రావడం కలకలం రేపింది.

 దంపతుల దారుణ హత్య

దంపతుల దారుణ హత్య

మహారాష్ట్రలోని పూణెలో ఓ వ్యక్తిని, అతని భార్యను ఆ మహిళ కుమారుడు పారతో కొట్టి చంపాడు. ఈ ఘటన పూణెలోని దపోడిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రసన్న ముర్గుట్కర్‌ అలియాస్ ప్రసన్న (32) అనే యువకుడిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. శంకర్ కేట్ అలియాస్ శంకర్ (60), ఆయన భార్య సంగీతా (55) అనే దంపతులు హత్యకు గురైనారని పోలీసులు అన్నారు.

 గొడ్డలి చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు

గొడ్డలి చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు

పూణెలోని దపోడిలోని దంపతుల నివాసంలో జంట హత్యలు జరిగాయి. ప్రసన్న ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చున్న కొంతసేపటి తరువాత శంకర్, ఆయన భార్య సంగీతాను దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. శంకర్, సంగీతా దంపతులను హత్య చేసిన తరువాత నెత్తుటి గొడ్డలి చేతిలో పట్టుకున్న ప్రసన్న దంపతుల ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించి పారిపోవడానికి ప్రయత్నించిన ప్రసన్నను పట్టుకుని పోలీసులు వచ్చే వరకు వేచి చూతి తరువాత పోలీసులకు అప్పగించారు.

 పగ తీర్చుకున్నాను

పగ తీర్చుకున్నాను

ప్రసన్న గొడ్డలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన శంకర్, సంగీతా దంపతులు మృతి చెందిన ఘటనపై భోసరి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రసన్న మురుగుట్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేశారు. మంచి ఉద్యోగం సంపాధించడానికి కోచింగ్ తీసుకుంటున్న ప్రసన్న జంట హత్యలు చెయ్యడానికి గల కారణాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

 వాడు లోఫర్ నా కొడుకు

వాడు లోఫర్ నా కొడుకు

2015 నుండి 2017 వరకు ప్రసన్న, అతని తల్లి హత్యకు గురైన శంకర్ కోటే ఇంట్లో అద్దెకు నివసించారు. ప్రసన్న తల్లిపై శంకర్ కేట్ చాలాసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. 2019లో చనిపోయే ముందు తల్లి ఈ విషయాన్ని ఆమె కుమారుడు ప్రసన్నకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రసన్న శంకర్ పై పగ తీర్చుకోవాలని ఇంతకాలం ఎదురు చూశాడు.

 కోచింగ్ మధ్యలో ఢిల్లీ నుంచి పూణే వెళ్లాడు

కోచింగ్ మధ్యలో ఢిల్లీ నుంచి పూణే వెళ్లాడు

యుపిఎస్‌సి పరీక్షకు (యుపిఎస్‌సి ఆస్పిరెంట్) సిద్ధమవుతున్న ప్రసన్న ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ లో పీజీ చేశాడని పోలీసులు అన్నారు. యుపిఎస్‌సి సన్నాహకాల కారణంగా ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్న ప్రసన్న తన తల్లిని చిత్రహింసలకు గురి చేసిన శంకర్ కేట్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఢిల్లీ నుండి పూణే వచ్చాడు. రాత్రి దాపోడిలోని శంకర్ నివాసానికి వెళ్లిన ప్రసన్న కొంతసేపు వారితో మాట్లాడాడు. తరువాత శంకర్, సంగీతా దంపతుల తలలపై గొడ్డలితో దాడి చేసి వారిని చంపేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని. చుట్టుపక్కల వాళ్లు అతన్ని పపట్టుకుని మాకు అప్పగించారని పూణే పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+