కావేరి కోసం త్రిసభ్య బెంచ్ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు, ఆల్ పార్టీ మీటింగ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ/చెన్నె: కావేరీ జలాల పంపిణీ వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ అంశం సుప్రీంకోర్టు కోర్టులో ఉంది, కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య కావేరి నీటి పంపకాల వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు మంగళవారం త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
కావేరి నీటిని విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కావేరి జలాల వివాదం పిటిషన్లు విచారణ చెయ్యడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. ముగ్గురు న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన దరఖాస్తు విచారణ ఈ శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై. చంద్రచూడ్ కావేరి నీటి పంపిణి విషయంలో దాఖలు అయిన పిటిషన్లు విచారణ చెయ్యడానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీకే మిశ్రా, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
సుప్రీం కోర్టులోని ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం కావేరీ జలాల పంపిణీ వివాదంపై విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తమిళనాడు రాష్ట్రం తరఫు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఆగస్టు 14వ తేదీ నుంచి కావేరి రిజర్వాయర్ నుంచి 24 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

గత శుక్రవారం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించారు. కావేరి నీటి మీద ఆదారపడిన కొన్ని జిల్లాల్లోని రైతులు పంటలు సాగు చేసుకోవడానికి తక్షణమే కావేరి నీరు అవసరం అయ్యిందని. ఈ నేపథ్యంలో తమిళనాడుకు కావేరి నీటి విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించాలని రోహత్గీ వాదించారు.
అయితే కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశాలు పాటించకుండా కర్ణాటక ప్రభుత్వం కేఆర్‌ఎస్, బిల్లిగుండ్లు వద్ద కబిని రిజర్వాయర్ నుండి విడుదల చేయాల్సిన నీటి పరిమాణాన్ని 15 వేల క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు తగ్గించిందని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని తమిళనాడు ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.

అయితే తమిళనాడుకు నీటిని విడుదల చేసే విషయంలో చర్చించడానికి బుధవారం బెంగళూరులో సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు చర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ కన్నడిగులు, తమిళ సోదరులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications