Jallikattu: జల్లికట్టుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఇక ఆనందంగా ఆడుకోవచ్చు..!
తమిళనాడు సాంస్కృతిక చిహ్నమైన జల్లికట్టుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జల్లికట్టు నిషేధించాలని జంతు సంరక్షణ సంస్థ పెటా వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. జల్లికట్టుకు అనుమతినిస్తూ చారిత్రక తీర్పునిచ్చింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని తెలిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు 2014లో ఇచ్చిన తీర్పును సవరించింది.
తమిళ సంస్కృతిలో జల్లికట్టు ఓ భాగమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని జస్టిస్ K M జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. గత కొన్ని శతాబ్దాలుగా రాష్ట్రంలో 'జల్లికట్టు' కొనసాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం జంతువులపై ఏదైనా క్రూరత్వాన్ని కలిగి ఉంటే జాగ్రత్త వహించిందని కోర్టు పేర్కొంది."తమిళనాడు చట్టం చెల్లుబాటు అయ్యే శాసనం, దానిలో ఎటువంటి లోపం లేదు" అని బెంచ్ తరపున జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు.

దీన్ని సవాల్ చేస్తూ పెటాతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. రాష్ట్ర చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ జంతు హక్కుల సంస్థ పెటా దాఖలు చేసిన పిటిషన్‌తో సహా అన్ని పిటిషన్లను బెంచ్ కొట్టివేసింది. "మేము చట్టాల పథకానికి అంతరాయం కలిగించము" అని ధర్మాసనం పేర్కొంది.












Click it and Unblock the Notifications