రోహిణి సింధూరి, రూపాకు సుప్రీం కోర్టు సలహాలు, మీరు ఇలాగే ఉంటే జీవితంపై ప్రభావం !
కర్ణాటక ఐపీఎస్ అధికారి డి రూపా సోషల్ మీడియాలో ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరికి చెందిన వ్యక్తిగత ఫోటోలను షేర్ చెయ్యడం కలకలం రేపింది. కర్ణాటకలో విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారిని రూపా, ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి మద్య చిచ్చురేపింది. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కారణంగా మహిళా అధికారులిద్దరూ బహిరంగంగా గొడవ పడటం కలకలం రేపింది.
ఆ తర్వాత రోహిణి సింధూరి ఐపీఎస్ అధికారిని రూపాపై పరువు నష్టం కేసు పెట్టారు. ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టుకు చేరింది. ఇద్దరు అధికారులకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. మీరు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేసి చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి, ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్‌లకు సుప్రీంకోర్టు సూచించింది.

మీ మధ్య పోరు ఇలాగే కొనసాగితే అది మీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రజాజీవితంలో మీరు ఇలాంటి ప్రవర్తన కొనసాగించవద్దని పేర్కొంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఇద్దరికి సూచించారు. ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. వారిద్దరూ తమ ఆరోపణలు, ప్రత్యారోపణలను విరమించుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రానికి సూచిస్తామని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది.
కర్ణాటకలో అవినీతిని ఎదిరించిన ఐపీఎస్ అధికారినిగా రూపా, ఐఏఎస్ అధికారినిగా రోహిణి సింధూరి మంచి పేరు తెచ్చుకున్నారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల వారికి ఈ ఇద్దరు అధికారుల పేర్లు పరిచయమే. అయితే వ్యక్తిగత విషయాల్లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో వీరి వివాదం చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది నిజాయితీగా పని చేస్తున్న ఇద్దరు అధికారులను ఇప్పటికే పలుసార్లు బదిలీలు చెయ్యడంతో ఇద్దరి పేర్లు కర్ణాటకలో నిత్యం వార్తల్లో ఉంటున్నాయి.












Click it and Unblock the Notifications