Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్కీ ఫ్యామిలీకి ఏం అయ్యింది. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లి క్లైమాక్స్ లో!

బెంగళూరు/దావణగెరె: అమెరికాలో కర్ణాటకలోని దావణగెరెకు చెందిన దంపతులు, వారి బిడ్డ అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో మృతదేహాలను తీసుకొచ్చే ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇది అసహజ మరణమని అమెరికాలోని బాల్టిమోర్ కౌంటీ పోలీసులు తెలిపారు.

విచారణ జరుగుతున్నందున ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదని కర్ణాటకలోని దావణగెరె జిల్లా కలెక్టర్ ఎం.వీ వెంకటేష్ తెలిపారు. దావణెరెలోని విద్యానగర్‌లోని యోగేష్‌ కుటుంబం నివాసముంటున్న ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం దావణగెరె జిల్లా కలెక్టర్ ఎం.వీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు.

The Techie family from Davanagere, Karnataka died suspiciously in America

యోగేష్‌ తన భార్య, బిడ్డను కాల్చి చంపి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు చెబుతున్నారు. అయితే అధికారికంగా అమెరికా అధికారులు ఈ విషయంలో స్పష్టం చెయ్యలేదని అధికారులు తెలిపారని అన్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతామని అమెరికా పోలీసుల నుంచి మాకు సమాచారం అందింది. చట్ట ప్రకారం సమాచారం అందజేస్తామని దావణగెరె జిల్లా కలెక్టర్ ఎం.వీ వెంకటేష్ తెలిపారు.

న్యూయార్క్ అధికారి మంజునాథ్‌తో టచ్‌లో ఉన్నాం. కుటుంబ సభ్యుల మృతికి గల ఖచ్చితమైన కారణం తెలిసిన వెంటనే మీడియాకు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం. విచారణ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందనే దాని ఆధారంగా మృతదేహాలను దావణగెరెకు తీసుకురానున్నారు. ఇప్పుడేమీ చెప్పలేను.ఈ కేసులో అమెరికా పోలీసులు చార్జిషీటును సిద్ధం చేయాల్సి ఉంటుందని దావణగెరె జిల్లా కలెక్టర్ ఎం.వీ వెంకటేష్ తెలిపారు.

The Techie family from Davanagere, Karnataka died suspiciously in America

అక్కడి నిబంధనలను పాటించాలి. వీలైనంత త్వరగా మృతదేహాలను తీసుకొచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మేము అతని కుటుంబంతో టచ్ లో ఉంటామని, అన్ని విధాలుగా సహకరిస్తానని దావణగెరె జిల్లా కలెక్టర్ ఎం.వీ వెంకటేష్ చెప్పారు. దావణగెరెకు చెందిన యోగీష్, ప్రతిభ, యష్ అమెరికాలోని న్యూయార్క్‌లోని బాల్టిమోర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా మరణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+