నా మీద రేప్ చేసింది వీళ్లు కాదు, వీడియోలో కూడా వీళ్లు లేరు, ఓవరాక్షన్ చేశారు !
కర్ణాటకలో కలకలం రేపడంతో పాటు ఆ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన హనగల్ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్టు అయిన ఐదుగురిలో ఇద్దరు తనపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేశానని బాధితురాలు మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. బాధితురాలి స్టేట్ మెంట్ తో కర్ణాటకలో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది.
గ్యాంగ్ రేప్ కేసు కొత్త మలుపు తిరిగింది. కర్ణాటకలోని హావేరి జిల్లాలోని హానగల్ మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్రంలో ఉన్న మహిళను పోలీసులు ఆదివారం అకస్మాత్తుగా శిరిసి సమీపంలోని ఆమె స్వగ్రామానికి పిలుచుకుని వెళ్లి అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోలీసుల తీరు విషయంలో బాధితురాలు కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నాపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని బాధితురాలు చెప్పింది.

అరెస్టు అయిన వారిలో ఇద్దరు నాపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తుల ఫోటోలను నాకు చూపించారని, నాపై లైంగిక వేధింపులకు పాల్పడింది వారు కాదని బాధితురాలు మీడియాకు చెప్పింది. అంతేకాకుండా, నాపై జరిగిన లైంగిక దాడికి, ఆ సమయంలో తన మీద జరిగిన శారీరక హింసకు సంబంధించిన వీడియోలో ఆ ఇద్దరూ లేరని బాధితురాలు స్పష్టం చేసింది.
తనకు పోలీసులు భద్రత కల్పించలేదని బాధితురాలు ఆరోపించింది. సంఘటనా స్థలంలో తనిఖీ చేస్తున్నామని చెప్పిన పోలీసులు తనను వారి వెంట పిలుచుకుని వెళ్లారని, అయితే తరువాత తనను తన ఇంటికి తీసుకొచ్చి వదిలేశారని, నా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు వెళ్లిపోయారని, తమకు ప్రాణభయం ఉన్నా ఇంటి దగ్గర పోలీసులను భద్రత కోసం నియమించలేదని బాధితురాలితో పాటు ఆమె భర్త మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న ఆశ ఎవరికి లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ మహిళా ప్రతినిధి బృందం, బీజేపీ మహిళా నేతలు బాధితురాలిని కలుస్తారని తెలిసి ఆమెను వేరే చోటికి తరలించారని, అలాంటి వారి నుంచి బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు ఏమాత్రం లేదని బీజేపీ నాయకుడు బీవై విజయేంద్ర కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు.












Click it and Unblock the Notifications