వేరు కాపురం కోసం భ‌ర్త‌ను వేధించిన భార్య‌... ఏకంగా చెవి కొరికేసింది...

ఈ మధ్యకాలంలో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య చిన్న‌చిన్న‌వాటికే మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌స్తున్నాయి. దాంతో కొట్టుకోవ‌డం, లేదా చంపుకోవ‌డం వంటివి చేస్తున్నారు. మొన్న‌టికి మొన్న పుట్టిన‌రోజు వేడుక‌లకు తీసుకెళ్ల‌లేద‌ని భ‌ర్త ముక్కుపై తీవ్రంగా కొట్టింది ఓ మ‌హిళ‌. ఆ ఘ‌ట‌నను ఇంకా మ‌రువ‌క‌ముందే మ‌రో మ‌హిళ ఏకంగా భ‌ర్త చెవి కొరికేసింది. వేరు కాపురం పెట్టాలంటూ భ‌ర్త‌ను వేధించింది ఓ మ‌హిళ... అందుకు త‌ను అంగీక‌రించ‌క పోవ‌డంతో ఏకంగా త‌న చెవినే కొరికేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా భాదితుడే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంత‌పోయారు.

ఈ ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. 'నా భార్య నా చెవి కొరికేసింది'అంటూ ఓ వ్యక్తి పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చాడు. బాధితుడి ఫిర్యాదు విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారు. అత‌డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. తన భార్య తన కుడి చెవిని కొరికేసిందని, ఇప్పుడు ఆ చెవికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందంటూ ఢిల్లీలోని సుల్తాన్ పురిలో 45కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

The wife who harassed her husband for separate camphor... bit her ear together

భ‌ర్త కుడిచెవిని కొరికేసిన భార్య‌: సుల్తాన్‌పూర్‌లో నివ‌సించే ఓ జంట త‌రుచుగా గొడ‌వ‌లు ప‌డేవారు. అయితే, వేరు కాపురం పెట్టాలంటూ త‌రుచుగా భార్య, భ‌ర్త‌తో గొడ‌వ‌కు దిగేది. ఈ క్ర‌మంలో న‌వంబ‌ర్ 20వ తేది ఉద‌యం చెత్త ప‌డేసేందుకు బ‌య‌టికి వెళ్లిన భ‌ర్త‌.. భార్య‌తో ఇల్లంతా శుభ్రం చేయ‌మ‌ని చెప్పి బ‌య‌టికి వెళ్లాడు. అయితే, తిరిగి వ‌చ్చేస‌రికి ఇళ్లు మునుప‌టిలానే ఉంది. దీంతో ఆ భ‌ర్త స‌ద‌రు మ‌హిళను ప్ర‌శ్నించాడు. వెంట‌నే భార్య భ‌ర్త‌తో గొడ‌వ‌కు దిగింది.

గొడ‌వ‌లో భాగంగా ఇంటిని అమ్మేసి వ‌చ్చిన డ‌బ్బుతో వేరు కాపుర పెడ‌దామ‌ని చెప్పింది. ఇల్లు అమ్మేందుకు ఆ భ‌ర్త అంగీకరించకపోవటంతో గొడవ పెద్దదిగా మారింది. దాంతో స‌ద‌రు మ‌హిళ భ‌ర్త‌ను ఇష్టమొచ్చినట్లుగా తిట్ట‌డం ప్రారంభించింది. భార్య మాట‌ల‌కు విసుగుచెందిన భ‌ర్త కోపంతో ఆమెను ప‌క్క‌కు నెట్టేసి బయటకు వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ ప్ర‌య‌త్నంలో భార్య భ‌ర్తను వెనక్కి లాగి తన కుడిచెవి కొరికేసింది. ఇదంతా స్వ‌యంగా బాధితుడే పోలీసుల‌కు వివ‌రించాడు.

ఆసుప‌త్రి పాల‌యిన భ‌ర్త‌: అయితే, ఈ ఘ‌ట‌న‌లో త‌న కుడిచెవి బాగా ఛిద్రమైపోయిందని, దీంతో తన కుమారుడు తనను బంగోల్ పురిలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాడని బాధితుడు ఫిర్యాదులో వెల్లడించాడు. కానీ అక్కడి డాక్టర్లు తనను జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోవాలని సూచించారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతు అతని భార్యపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+