ఆరైల్వే స్టేషన్ లో ఏం జరుగుతోంది ? ప్లాస్టిక్ డ్రమ్ ల్లో వరుసగా మహిళల శవాలు. సీరియల్ కిల్లర్ స్కెచ్ తో !
మహిళలను హత్య చేసిన నిందితులు పోలీసులకు చిక్కకుండా వారి శవాలను ప్లాస్టిక్ డ్రమ్ లో పెట్టి నీట్ గా సీల్ చేసి ఆ డ్రమ్ లు రైల్లేస్టేన్ లో వదిలేసి వెళ్లిపోతున్నారు.
బెంగళూరు/యశవంతపురం: బెంగళూరు సిటీలో మహిళల వరుస హత్యలతో ప్రజలు హడలిపోతున్నారు. మహిళలను హత్య చేసిన నిందితులు పోలీసులకు చిక్కకుండా వారి శవాలను ప్లాస్టిక్ డ్రమ్ లో పెట్టి నీట్ గా సీల్ చేసి ఆ డ్రమ్ లు రైల్లేస్టేన్ లో వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు మరో మహిళ శవం రైల్వేస్టేషన్ లోని డ్రమ్ లో చిక్కడంతో రైల్వే ప్రయాణికులు. బెంగళూరు ప్రజలు హడలిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో మహిళలను హత్య చేసి ఆ శవాలను బెంగళూరుకు తీసుకు వచ్చి వదిలివెళ్లిపోతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వేస్టేన్ లో మహిళ శవం
బెంగళూరు నగరంలోని యశవంతపురంలోని సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ మెయిన్ గేట్ సమీపంలోని ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న నీలి రంగు ప్లాస్టిక్ డ్రమ్ నుంచి దుర్వాసన వస్తోందని గమనించిన రైల్వే ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీల్ చేసిన డ్రమ్ ఓపెన్ చేసి పరిశీలించగా అందులో మహిళ శవం బయటపడటంతో పోలీసులతో పాటు రైల్వే ప్రయాణికులు హడలిపోయారు.

లేడీ ఎవరో తెలీదు
సుమారు 34 ఏళ్ల యహిళను వేరే ప్రాంతంలో హత్య చేసి శవాన్ని డ్రమ్ లో ప్యాక్ చేసి తీసుకవచ్చి రైల్వేస్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారని రైల్వే శాఖ ఎస్పీ సౌమ్యాలతా మీడియాకు చెప్పారు. మహిళ శవాన్ని డ్రమ్ లో పెట్టుకుని ఆడ్రమ్ ఆటోలో పెట్టుకుని రైవ్వేస్టేషన్ కు వచ్చారని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, ఆ సీసీటీవీ క్లిప్పింగ్స్ పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ సౌమ్యా లతా మీడియాకు చెప్పారు.

నాలుగు నెలల్లో మూడో శవం
బెంగళూరులోని యశవంతపురంలోని రైల్వేస్టేషన్ లో వరుసగా మహిళల శవాలు బయటపడుతుండటంతో రైల్వే ప్రయాణికులు హడలిపోతున్నారు. నవంబర్ 1వ తేదీన మహిళ శవాన్ని గోనె సంచిలో మూటకట్టి ఆ శవం ప్లాస్టిక్ డ్రమ్ లో ప్యాక్ చేసి తీసుకు వచ్చి రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద వదిలేసి వెళ్లిపోయారు. డిసెంబర్ 24వ తేదీ అర్దరాత్రి దాటిన తరువాత మరో మహిళ శవాన్ని ప్లాస్టిక్ డ్రమ్ లో ప్యాక్ చేసి తీసుకు వచ్చి యశవంతపురం రైల్లేస్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారు.

వరుస హత్యలతో షాక్
వరుసగా హత్యలకు గురౌతున్న మహిళల పేర్లు. వివరాలు కూడా చిక్కకపోవడంతో వారిని వేరే రాష్ట్రాల్లో హత్య చేసి ఇక్కడికి తీసుకు వచ్చి వదిలేసి వెలుతున్నారని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, సీసీటీవీ కెమెరా క్లిప్పింగ్స్ ఆధారంగా కేసు విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద రైల్వేస్టేషన్ లో వరుసపెట్టి మహిళల శవాలు ప్లాస్టిక్ డ్రమ్స్ లో బయటపడటంతో రైల్వే ప్రయాణికులతో పాటు బెంగళూరు ప్రజలు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications