చెట్టుకు కట్టేసి కొట్టించిన మహిళా సర్పంచ్
బర్నాలా: పంజాబ్ లో రాజకీయ రాక్షస క్రీడలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. దిగువ కులానికి చెందిన వారు బయటివారితో మాట్లాడుతున్న సమయంలో అధికారంలో ఉన్న సర్పంచ్ కుమారుడు, అతని స్నేహితులు రెచ్చిపోయారు. వారికి బుద్ది చెప్పవలసిన మహిళా సర్పంచ్ సైతం రెచ్చిపోయింది.
చెట్టుకు కట్టేసి కొట్టించింది. పంజాబ్ లోని బర్నాల జిల్లా దుర్కోట్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సురేష్ కుమార్, సంతోష్, దుర్కోట్ గ్రామంలో నివాసం ఉంటున్న మహిళ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు.
జులై 27వ తేదిన సురేష్ కుమార్, సంతోష్ మహిళా ఉద్యోగి దగ్గర రూ. రెండు వేలు తీసుకోవడానికి దుర్కోట్ గ్రామానికి వెళ్లారు. బైక్ పార్క్ చేసి మహిళా ఉద్యోగి రాకకోసం ఎదురు చూశారు. అదే సమయంలో ఆ గ్రామం మహిళా సర్పంచ్ సర్బజీత్ కుమారుడు బిక్రమ్ సింగ్, అతని స్నేహితులు అక్కడికి వెళ్లారు.

అదే సమమంలో మహిళ సాటి ఉద్యోగి సురేష్ కుమార్ కు డబ్బులు ఇవ్వడానికి అక్కడి వెళ్లింది. అంతే ముగ్గురుని పట్టుకుని చితకబాదారు. అదే సమయంలో మహిళా సర్పంచ్ సర్బజీత్ అక్కడికి వెళ్లింది. అమె వారి మీద కర్రతో దాడి చేసింది. ముగ్గురుని చెట్టుకు కట్టేసి చితకబాదారు.
ఆ చిత్రాలను మహిళా సర్పంచ్ కుమారుడు మొబైల్ లో చిత్రీకరించి ఆన్ లైన్, యూట్యూబ్ లో పోస్టు చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ ఒత్తిడితో రాజీ కావాలని బాధితులను పోలీసులు బెదిరించారు. లేదంటే గంజాయి సరఫరా చేస్తున్నారని, వ్యభిచారం చేస్తున్నారని కేసులు పెడుతామని పోలీసులు బెదిరించారు.
ఈ విషయంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే నిందితులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగ్రామంలో నివాసం ఉంటున్న మహిళ వేరే పార్టీకి చెందినదనే కారణంతో మహిళా సర్పంచ్ దాడి చేయించారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications