ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు- బాంబు పేల్చిన కీలక నేత
Sanjay Raut: మరాఠా గడ్డపై మరోసారి భారతీయ జనతా పార్టీ పాగా వేసినట్టే. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికే మరోసారి ఓటర్లు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అందుకుంది మహాయుటి. 222 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ఎన్నో అంచనాలు ఉన్న మహా వికాస్ అఘాడీ పూర్తిగా నిరాశపరిచింది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వంద సీట్లు కూడా ఆ పార్టీకి దక్కేలా కనిపించట్లేదు.

దాదాపుగా ఏకపక్షంగా వెలువడుతున్నాయి ఇక్కడి ఫలితాలు. ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ మహాయుటి దూకుడు కొనసాగింది. కొప్రి- పఛ్‌పకడీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, బారామతిల్లో ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
ఈ ఫలితాలపై శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందించారు. ఈ ఫలితాలు- ప్రజలు ఇచ్చిన తీర్పు కాదని వ్యాఖ్యానించారు. మహాయుటి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అయినప్పటికీ- ఇంత భారీ సంఖ్యలో సీట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
ప్రజల నాడి ఎమిటో తమకు తెలుసునని, వారి అభిప్రాయాలకు విరుద్ధంగా ఫలితాలు వెలువడుతున్నాయని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు. మహాయుటికి 120 కంటే ఎక్కువ సీట్లు రాబోవని తాము నిర్వహించిన సర్వేల్లో తేలిందని అన్నారు. ఏం అభివృద్ధి చేసిందని ఇంత భారీ మెజారిటీ మహాయుటికి దక్కిందని, 75 నియెజకవర్గాలకే మహా వికాస్ అఘాడీ ఎలా పరిమితమౌతుందని ప్రశ్నించారు.

-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications