ప్రధాని ‘మోడీ’ పేరు వాడుకుంటూ మోసాలు: సీబీఐ కేసు
ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరునే వాడుతూ.. ఓ వెబ్‌సైట్‌ను సృష్టించి ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరునే వాడుతూ.. ఓ వెబ్‌సైట్‌ను సృష్టించి ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నరేంద్ర మోడీ కంప్యూటర్ సాక్షారత మిషన్ (ఎన్ఎమ్సీఎస్ఎమ్) పేరుతో ఓ నకిలీ సంస్థ ప్రజలను మోసగిస్తోందని గుర్తించింది ప్రధాని కార్యాలయం.
వెంటనే ఈ విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అతుల్‌కుమార్, జగ్మోహన్సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారని.. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.

వివిధ కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని.. అడ్మిషన్లు, ఫ్రాంచైజీల కోసం నమోదు చేసుకోవచ్చని వారు వెబ్సైట్లో పేర్కొన్నారని వివరించారు. ఇందు కోసం డీడీల రూపంలో డబ్బును వసూలు చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications