Three Language Policy: త్రిభాషా విధానం ఏంటి?.. తమిళనాడు దానిని ఎందుకు వ్యతిరేకిస్తోంది?

Three Language Policy: జాతీయ విద్యా విధానం 2020లోని త్రిభాషా విధానానికి సంబంధించి చర్చ మరోసారి ప్రారంభమైంది. ముఖ్యంగా తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. కొన్నేళ్ల చర్చల అనంతరం 1986 నాటి విద్యా విధానం స్థానంలో జాతీయ విద్యా విధానం 2020 వచ్చింది. దీనిలో త్రిభాషా విధానానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనిపై తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీని ద్వారా తమపై హిందీని రుద్దుతున్నారని వారు అంటున్నారు.

జాతీయ విద్యా విధానం-2020లోని త్రిభాషా విధానం ఏమిటి?
జాతీయ విద్యా విధానం-2020లోని త్రిభాషా విధానం లేదా త్రిభాషా సూత్రం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని పేర్కొంది. అందులో కనీసం రెండు భారత మాతృభాషలు అయి ఉండాలి. మూడోది ఏదైనా అంతర్జాతీయ భాష కావచ్చు. ఈ ఫార్ములా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండింటికీ వర్తిస్తుంది. దీనిలో రాష్ట్రాలు ఎటువంటి ఒత్తిడి లేకుండా భాషలను ఎంచుకునే స్వేచ్ఛను పొందుతాయి.

విదేశీ భాషల గురించి త్రిభాషా విధానం ఏం చెబుతుంది?
త్రిభాషా విధానంలో భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలకు కూడా స్థానం కల్పించబడింది. సెకండరీ స్థాయిలో మూడో భాషగా ఇంగ్లీషుతో పాటు విద్యార్థులు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇతర విదేశీ భాషలను కూడా నేర్చుకోవచ్చు. తద్వారా ఇది వారికి విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి, వారి ప్రపంచజ్ఞానాన్ని పెంచుకోవడానికి, వారి భవిష్యత్తు అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Three Language Policy What is it and Why is Tamil Nadu Opposing It

త్రిభాషా విధానం ఎప్పుడు వచ్చింది?
విద్యార్థులకు మూడు భాషలు నేర్పించే విధానాన్ని మొదట విద్యా కమిషన్(1964-66) ప్రతిపాదించింది. దీన్నే కొఠారి కమిషన్ అంటారు. దీనిని 1968 జాతీయ విద్యా విధానంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అధికారికంగా స్వీకరించారు. 1986 జాతీయ విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ఇది మాధ్యమిక విద్యలో ఆంగ్లం, రాష్ట్ర భాష, హిందీ భాషలను బోధించేలా చూడాలని పేర్కొంది. దీనిని 1968లోని విద్యా విధానం నుంచి కొనసాగించారు. 1992లో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భాషా వైవిధ్యాన్ని, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడానికి దానిని సవరించింది.

జాతీయ విద్యా విధానం 2020లో హిందీని రుద్దుతున్నారా?
జాతీయ విద్యా విధానం 2020లో హిందీని తప్పనిసరి అని ఏం చెప్పలేదు. ఇందులో ఏ ప్రత్యేక భాషను రుద్దకూడదని నిర్ధారించబడింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి, బహుభాషావాదాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నిర్ధారించడానికి త్రిభాషా అమలు కొనసాగుతుందని పేర్కొంది. ఇందులో ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దరు. విద్యార్థులు నేర్చుకోవలసిన మూడు భాషలు రాష్ట్రాలు, ప్రాంతాలు, విద్యార్థుల ఎంపిక ప్రకారం ఉంటాయని పేర్కొంది. మూడు భాషలలో రెండు భారతీయ మూలానికి చెందిన భాషలు ఎంచుకోవచ్చని తెలిపింది. దీనికి విరుద్ధంగా 1968 జాతీయ విద్యా విధానంలో హిందీని తప్పనిసరి చేశారు. జాతీయ విద్యా విధానం 1986, 1992 సవరణ ఈ విధానాన్ని బలోపేతం చేశాయి. హిందీని అనుసంధాన భాషగా ఉపయోగించడంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరం అని తేల్చి చెప్పింది.

తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తోంది ?
త్రిభాషా విధానంపై కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య యుద్ధం నడుస్తోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తమిళనాడు తన నిరసనను తెలియజేస్తోంది. తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాన్ని అమలు చేయబోమని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదన్నారు. ఇది ఉండగా.. కేంద్రం నిధులు కావాలంటే జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సేందేనని కేంద్రం పట్టుబడుతోంది. ఈ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని స్టాలిన్ ప్రకటించారు. నిజానికి దశాబ్ధాలుగా హిందీని తమిళనాడు వ్యతిరేకిస్తూనే ఉంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దీనిపైనే వివాదం నడిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+