వెంటాడి రైతును చంపితినేసిన పెద్ద పులి

మైసూరు: పొలం దగ్గర పశువులు మేపుకుంటున్న రైతును పెద్ద పులి చంపి తినేసిన దారుణ సంఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్.డి.కోటే తాలుకాలో జరిగింది. హాదనూరు గ్రామంలో నివాసం ఉంటున్న శివన్న (50) పులి దెబ్బకు ప్రాణాలు విడిచాడు.

శివన్న మంగళవారం మద్యాహ్నాం 12 గంటల సమయంలో గ్రామం సమీపంలోని పొలం దగ్గరకు వెళ్లాడు. పొలంలో పశువులను కట్టేసి పొలం పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో అటవి ప్రాంతం నుంచి పెద్ద పులి అక్కడికి వెళ్లింది.

విషయం గుర్తించిన శివన్న పులి దాడి నుంచి తప్పించుకోవడానికి విఫలయత్నం చేశాడు. అయితే పులి అతనిని వెంటాడి దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కొని వెళ్లింది. శివన్న శరీరాన్ని దాదాపు 70 శాతం తినేసింది.

Tiger Killed man in Mysuru district in Karnataka

విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులు, అటవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పులి సంచరిస్తున్నదని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

అక్టోబర్ 13వ తేదిన నంజనగూడు తాలుకా హెడియాల సమీపంలోని హాదనూరు గ్రామంలో నివాసం ఉంటున్న నాగరాజు (38) అనే రైతు పొలం పనులు చేసుకుంటున్న సమయంలో పులి దాడి చేసి చంపి తినేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+