కార్గిల్, సియాచిన్, గల్వాన్‌లలోనూ పర్యాటకులకు అనుమతి

పర్యాటకులకు భారత సైన్యం శుభవార్త చెప్పింది. హిమాలయాల్లోని యుద్ధక్షేత్రాల సందర్శనకు సంబంధించి భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్‌, సియాచిన్ గ్లేసియర్‌, గల్వాన్‌ లాంటి యుద్ధ క్షేత్రాల్లో పర్యాటకులకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది బుధవారం వెల్లడించారు.

'జమ్మూకాశ్మీర్‌లో పర్యటకరంగ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. కొంత కాలంగా సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తోంది. అందుకే పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించాలని నిర్ణయించాం. ఇందుకోసం 48 ప్రాంతాలను గుర్తించాం. వచ్చే 5 ఏళ్లలో పర్యటకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది' అని చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ద్వివేది పేర్కొన్నారు.

Tourists allowed in Kargil Siachen Galwan Army COAS Dwivedi

పుణె యూనివర్సిటీలో 'భారత్‌ వృద్ధి పయనంలో ఇండియన్‌ ఆర్మీ పాత్ర' అంశంపై జనరల్‌ ద్వివేది ప్రత్యేకంగా ప్రసంగించారు. సరిహద్దు ప్రాంతాల్లో పర్యాటకులు సాహస కార్యకలాపాలు చేయడాన్ని ఆర్మీ ప్రోత్సహిస్తుందని, ఇందుకోసం టూర్‌ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తుందని తెలిపారు.

కార్గిల్‌, గల్వాన్‌ లాంటి యుద్ధక్షేత్రాలను చూసేందుకు పర్యాటకులకు అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు. లడఖ్‌లోని కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్ గ్లేసియర్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఇక్కడ సేవలందించడం సైన్యానికి సవాల్‌తో కూడుకున్న పని ఆయన తెలిపారు.

లడఖ్‌లోనే ఉన్న కార్గిల్‌లో 1999లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా బలగాల మధ్య 2020 జూన్‌లో చోటుచేసుకున్న ఘర్షణల్లో పదుల సంఖ్యలో భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన వందకుపైగా సైనికులు హతమయ్యారు. అయితే, తాజాగా, భారత్, చైనా దేశాలు సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో భారత సైన్యం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+