ఈ -20 కాదు.. కల్తీ ఇంధనమే అసలు కారణం: టయోటా

బిహార్‌ కు చెందిన టొయోటా ఇన్నోవా హైక్రాస్ యజమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో సదరు కస్టమర్ మాట్లాడుతూ.. తన ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఎంపీవీ వాహనాన్ని దాదాపు 12 వేల కిలోమీటర్లు నడిపానని ఆ తర్వాత ఇంజిన్‌ లో తీవ్రమైన వైబ్రేషన్స్, నాకింగ్ , బ్రేక్‌ డౌన్ తదితర సమస్యలు వచ్చాయని పేర్కొన్నాడు. ఈ20 పెట్రోల్ వాడటం వల్లే తన కారు ఇంధన వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించాడు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై టయోటా కిర్లోస్కర్ మోటార్ అధికారికంగా స్పందించింది. వాహనంలో తలెత్తిన సమస్యకు ఈ20 (E20) పెట్రోల్ కారణం కాదని, కల్తీ, నాణ్యత లేని ఇంధనం వల్లే ఈ సమస్య వచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

ఇటీవల ఓ వినియోగదారుడు తన టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో ఈ20 పెట్రోల్ ఉపయోగించడం వల్లనే ఇంజిన్, ఇంధన వ్యవస్థలో లోపాలు తలెత్తాయని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. ఈ వ్యవహారం వాహనదారుల్లో ఆందోళన కలిగించడంతో సంస్థ దీనిపై త్వరితంగా స్పందించింది. తమ ఇన్నోవా హైక్రాస్ మోడల్ వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉండేలా రూపొందించామని, అన్ని రకాల కఠినమైన పరీక్షలు పూర్తి చేసి ధృవీకరించిన తర్వాతే విక్రయిస్తున్నామని కంపెనీ స్పష్టం చేసింది.

ఇంధన కలుషితమే అసలు కారణం: టయోటా స్పష్టత

సదరు కస్టమర్ వాహనాన్ని టయోటా డీలర్‌ షిప్‌ లోని అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం నిశితంగా పరిశీలించింది. ఈ విస్తృత తనిఖీల్లో కారులోని రక్షణ భాగాలు లేదా ప్రధాన ఇంధన వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని గుర్తించింది. అయితే, కారు ఇన్‌ స్పెక్ట్ చేసిన తరుణంలో ట్యాంక్‌ లోని ఇంధనం తీవ్రంగా కలుషితమై ఉన్నట్లు తేలింది. నాణ్యత లేని ఇంధనం కారణంగానే వాహనం నిలిచిపోయిందని, కానీ కస్టమర్స్ భావిస్తున్నట్లుగా ఈ20 ఇంధన వినియోగం వల్ల కాదని టయోటా ప్రతినిధులు పేర్కొన్నారు.

కంపెనీ సర్వీస్ ప్రోటోకాల్ ప్రకారం, సాంకేతిక సిబ్బంది వాహనంలోని ఇంధన ట్యాంక్ అలాగే ఫ్యూయల్ లైన్లను పూర్తిగా ఖాళీ చేసి భద్రంగా శుభ్రపరిచారు. ఆ తర్వాత మళ్లీ సరికొత్త ప్రామాణిక ఈ20 పెట్రోల్‌ను నింపి పరీక్షించారు. ఆ సమయంలో కారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సజావుగా సాగింది. వాహనంలో తలెత్తిన తాత్కాలిక లోపం పూర్తిగా తొలగిపోయిందని నిర్ధారించుకున్న పిదప, ఆ ఇన్నోవా హైక్రాస్‌ను తిరిగి సదరు కస్టమర్‌కు విజయవంతంగా అప్పగించినట్లు టయోటా ప్రకటించింది.

Toyota Kirloskar Clarifies Adulterated Fuel Not E20 Caused Issue in Bihar Innova Hycross Innova

ఈ ప్రచారాల నేపథ్యంలో వాహనదారులకు టయోటా కిర్లోస్కర్ మోటార్ పలు కీలక సూచనలు చేసింది. వాహనాల సజావు పనితీరు కోసం మరియు ఇలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ఉండటానికి ఎల్లప్పుడూ ధృవీకరించబడిన, నమ్మకమైన బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకోవాలని సూచించింది. కల్తీ లేని ఇంధనం ఇంజిన్ ఆయుష్షును పెంచుతుందని కంపెనీ గుర్తుచేసింది. ఇటువంటి సాంకేతిక సమస్యలపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని, ఏదైనా సందేహం ఉంటే నేరుగా సమీప డీలర్‌ షిప్ లేదా అధికారిక కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+